ఓటీటీలో అదరగొడుతున్న రష్మిక మందన్న తెలుగు మూవీ – ట్రెండింగ్ లిస్ట్‌లో నంబర్ వన్
Entertainment | Published On Dec 6, 2025, 4.33 pm IST
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ
రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. డిసెంబర్ 5న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఒక్కరోజులోనే ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
లవ్ డ్రామాగా తెరకెక్కిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ మరో నాయికగా కనిపించింది. నవంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ది గర్ల్‌ఫ్రెండ్ నలభై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
లేడీ ఓరియెంటెడ్ జానర్‌లో రష్మిక మందన్న చేసిన ఫస్ట్ మూవీ ఇది. తొలి ప్రయత్నంలోనే హిట్టు అందుకుంది. ఈ సినిమాలో భూమా పాత్రలో రష్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. రష్మిక కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఇదంటూ కామెంట్స్ వచ్చాయి.
ది గర్ల్‌ఫ్రెండ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ఓపెనింగ్స్ బాగుండటంతో యాభై కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ లాంగ్ రన్‌లో థియేటర్‌లలో నిలబడలేకపోయినా ఈ మూవీ నలభై కోట్లతోనే సరిపెట్టుకుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రోహిణి, రావురమేష్ కీలక పాత్రలు పోషించారు. ఖుషి ఫేమ్ షేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. ప్రేమలో ఓ యువతి ఎదుర్కొనే సంఘర్షణను ఆవిష్కరిస్తూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను తెరకెక్కించారు. ప్రియుడి ఆధిపత్యధోరణి, తండ్రి అంక్షల మధ్య భూమా ఎలా నలిగిపోయింది? తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే అంశాలతో ఈ మూవీ సాగుతుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు సంబంధించి ప్రశంసలతో పాటు దర్శకుడు రాహుల్ రవీంద్రపై విమర్శలు కూడా వచ్చాయి. అమ్మాయిలు చున్నీ తీసేయాలంటూ మెసేజ్ ఇవ్వడం మహిళా సాధికారత ఎలా అవుతుందంటూ చాలా మంది నెటిజన్లు డైరెక్టర్‌పై విమర్శలు గుప్పించారు. ఓటీటీలో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



