త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | పెళ్లి త‌ర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన ర‌ష్మిక – వేట మొద‌లైందంటూ పోస్ట్‌

పెళ్లైనా ప‌దిహేను రోజుల్లోనే తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టింది ర‌ష్మిక మంద‌న్న‌. మైసా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. ఈ విష‌యాన్ని ర‌ష్మిక సోష‌ల్ మీడియా ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On Mar 17, 2026, 8.01 pm IST

Rashmika Mandanna | పెళ్లి త‌ర్వాత  సెట్స్‌లో అడుగుపెట్టిన ర‌ష్మిక –  వేట  మొద‌లైందంటూ పోస్ట్‌
Advertisement

Rashmika Mandanna |  ఇటీవ‌లే టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఏడ‌డుగులు వేసింది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌. ఫిబ్ర‌వ‌రి 26న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి జ‌రిగింది. ప‌ది రోజుల పాటు పెళ్లి వేడుక‌ల‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ ర‌ష్మిక సెట్స్‌లో అడుగుపెట్టింది. వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ కోసం ప‌దిహేను రోజులు మాత్ర‌మే బ్రేక్ తీసుకున్న ర‌ష్మిక మంద‌న్న తిరిగి మైసా మైసా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది.

ఫొటోకు క్యాప్ష‌న్‌...

ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న‌పై ఇంటెన్స్ ఛేజింగ్ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను డైరెక్ట‌ర్ ర‌వీంద్ర పుల్లె షూట్ చేస్తున్నారు. మైసా చిత్రీక‌ర‌ణ‌ తాలూకు ఫొటోను అభిమానుల‌తో పంచుకుంది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ ఫొటోకు వేట మొద‌లైంది అంటూ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. కొండ ప్రాంతంలో మైసా షూటింగ్ జ‌రుగుతోన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

గోండు తెగ‌ల బ్యాక్‌డ్రాప్‌లో...

గోండు తెగ‌ల బ్యాక్‌డ్రాప్‌లో ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా డైరెక్ట‌ర్ ర‌వీంద్ర పుల్లె మైసా సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఇందులో పోరాట యోధురాలైన గిరిజ‌న యువ‌తిగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌బోతున్న‌ది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ పాత్ర‌ను చేయ‌డం ర‌ష్మిక కెరీర్‌లో ఇదే ఫ‌స్ట్ టైమ్ కావ‌డం గ‌మ‌నార్హం. మైసా సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ఆండీ లాంగ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తోన్నారు. ఈ సినిమా కోసం ర‌ష్మిక రిస్కీ స్టంట్స్ చేసిన‌ట్లు స‌మాచారం. డూప్ లేకుండా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించింద‌ట‌.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో...

మైసా మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌తో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా పెళ్లి త‌ర్వాత‌ ర‌ణ‌బాలి షూటింగ్‌లో భాగ‌మ‌య్యారు. క‌ర్నూల్‌లో ఈ హిస్టారిక‌ల్ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.
ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 జూన్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. షాహిద్‌క‌పూర్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు కృతిస‌న‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement