Mysaa Movie | కేరళలో నేషనల్ క్రష్ – మైసా కోసం కొరియన్ ఫైట్ మాస్టర్
రష్మిక మందన్న మైసా మూవీ లేటెస్ట్ షెడ్యూల్ శనివారం నుంచి కేరళలో మొదలైంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొరియన్ ఫైట్ మాస్టర్ కేచా కంపక్డీ సారథ్యంలో హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించబోతున్నారు.
Entertainment | Published On Apr 25, 2026, 10.00 pm IST
Mysaa Movie | పెళ్లి తర్వాత సినిమాల జోరును మరింత పెంచింది రష్మిక మందన్న. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మైసా, రణబాలితో పాటు హిందీలో కాక్ టెయిల్ 2 సినిమా చేస్తోంది. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలోకి రాబోతున్నాయి.
కేరళలో...
తాజాగా మైసా సెట్స్‌లో అడుగుపెట్టింది రష్మిక మందన్న. ఈ యాక్షన్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కేరళలో శనివారం మొదలైంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొరియన్ స్టంట్ మాస్టర్ కేచా ఖంపక్డీ సారథ్యంలో హై ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్‌లను చిత్రీకరించబోతున్నారు.
ఈ యాక్షన్ సీన్స్ కోసం ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో బ్యాంకాక్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది రష్మిక మందన్న. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టూ హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నది. డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్‌లో రష్మిక స్వయంగా పాల్గొననుందట.కొరియన్‌లో సూపర్ హిట్ మూవీ అంగ్‌బ్యాక్ 2కు కేచా కంపక్డీ స్టంట్స్ అందించారు. తెలుగులో మిరాయ్, ఓజీ, పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు.
ఛాలెంజింగ్ మూవీ...
రష్మిక కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ మూవీగా మైసా ఉండబోతున్నట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో గోండ్ యువతిగా నేషనల్ క్రష్ కనిపించబోతుంది. తన జాతి అస్విత్వం కోసం ఓ యువతి సాగించిన పోరాటంతో దర్శకుడు రవీంద్ర పుల్లే ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. మైసాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైసా మూవీకి జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ది గర్ల్‌ఫ్రెండ్ తర్వాత రష్మిక చేస్తోన్న ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఇది. త్వరలోనే మైసా మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నారు.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
మే 18, 2026

Southwest Monsoon | వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
మే 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



