త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | నా జీవితం నా ఇష్టం – సోష‌ల్ మీడియా వేధింపుల‌పై ర‌ష్మిక ట్వీట్ వైర‌ల్‌

సోష‌ల్ మీడియాలో త‌న‌కు ఎదుర‌వుతోన్న వేధింపుల‌పై ర‌ష్మిక మంద‌న్న రియాక్ట్ అయ్యింది. త‌న‌ను, త‌న కుటుంబ‌స‌భ్యుల‌ను విమ‌ర్శిస్తూ పెట్టిన పోస్టుల‌ను ఇర‌వై నాలుగు గంట‌ల్లోగా వాటిని తొల‌గించాల‌నే అన్న‌ది. ఈ వివాదంలోకి త‌న కుటుంబ‌స‌భ్యుల‌ను లాగ‌డం క‌లిచివేస్తుంద‌ని ర‌ష్మిక చెప్పింది.

N

Entertainment | Published On Mar 12, 2026, 5.36 pm IST

Rashmika Mandanna | నా జీవితం నా ఇష్టం – సోష‌ల్ మీడియా వేధింపుల‌పై ర‌ష్మిక ట్వీట్ వైర‌ల్‌
Advertisement

Rashmika Mandanna |  సోష‌ల్ మీడియాలో కొంద‌రు త‌న‌పై కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ర‌ష్మిక మంద‌న్న అన్న‌ది. వ్యూస్‌, రీచ్ కోసం త‌న‌కు వ్య‌తిరేక‌తంగా ఎనిమిదేళ్ల క్రితం నాటి ఓ ఆడియెను లీక్ చేశార‌ని తెలిపింది. క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ ర‌ద్దుపై ర‌ష్మిక మంద‌న్న త‌ల్లి మాట్లాడిన‌ట్లుగా చెబుతోన్న ఓ ఆడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ర‌ష్మిక మంద‌న్న సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని ర‌క్షిత్ శెట్టి కుటుంబం కండీష‌న్లు పెట్టింద‌ని, ర‌క్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ కార‌ణంగా త‌న కూతురు ఎన్నో క‌ష్టాలు ప‌డిన‌ట్లు ఈ ఆడియో క్లిప్‌లో ర‌ష్మిక మంద‌న్న త‌ల్లి సుమ‌న్ మంద‌న్న పేర్కొన్న‌ది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక మంద‌న్న పెళ్లి జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఈ ఆడియో క్లిప్ లీక్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కావాల‌నే ఈ క్లిప్‌ను ర‌ష్మిక‌తో పాటు ఆమె త‌ల్లి క‌లిసి లీక్ చేశారంటూ క‌న్న‌డ అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తోన్నారు. ఈ వివాదంపై ర‌ష్మిక రియాక్ట్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

వేధింపులు...

గత 8 ఏళ్లుగా కొందరు వ్యక్తులు త‌న‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని, సోష‌ల్ మీడియా ద్వారా వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ర‌ష్మిక అన్న‌ది. అన్న‌ది. తాను చెప్ప‌ని మాట‌ల‌ను అన్న‌ట్లుగా క్రియేట్ చేస్తున్నార‌ని వాపోయింది. వ్యూస్‌, రీచ్ త‌న‌పై నిరాధార‌ణ‌మైన క‌థ‌నాల‌ను వ్యాప్తి చేస్తున్నార‌ని, త‌న‌పై విద్వేషాన్ని పెంచేలానే ల‌క్ష్యంతోనే అనుచిత పోస్ట్‌లు, కామెంట్లు చేస్తున్నార‌ని ర‌ష్మిక పేర్కొన్న‌ది.

కావాల‌నే బ‌య‌ట‌పెట్టారు..

"ఈ వేధింపుల కార‌ణంగా చాలా ఏళ్లుగా ఎంతో బాధ‌, మాన‌సిక వేద‌న‌ను ఎదుర్కొంటున్నా. పబ్లిక్ లైఫ్ అన్నప్పుడు ఇలాంటి విమర్శలు సహజమని భావించి ఇన్నాళ్లూ ఓపికతో మౌనంగా ఉన్నాను. కానీ గత 24 గంటల్లో చాలా జ‌రిగాయి. విమ‌ర్శ‌ల విష‌యంలో హ‌ద్దుల‌న్నీ దాటేశారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి వ్యక్తిగత సంభాషణను, మాకు తెలియకుండా రికార్డ్ చేసి ఇప్పుడు కావాల‌నే బయట పెట్టారు. ఈ ఆడియో క్లిప్‌లోని కొంత భాగాన్ని త‌మ‌కు అనుకూలంగా తప్పుగా చిత్రీకరిస్తూ కావాల‌నే వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఈ వివాదంలోకి ఎలాంటి సంబంధం లేని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా లాగారు. వారిని బాధ‌కు గురిచేశారు" అని ర‌ష్మిక మంద‌న్న అన్న‌ది.

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం...

"నా వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం కలిగించడమే కాకుండా, పరువు, గౌర‌వ‌మ‌ర్యాద‌ల‌కు న‌ష్టం క‌లిగించేలా పోస్టులు, కామెంట్లు పెట్టారు. న‌న్ను ఎంత‌లా విమ‌ర్శించినా, నాపై వేధింపుల‌కు పాల్ప‌డిన మౌనంగా ఉన్నాను, కానీ నా కుటుంబ‌స‌భ్యుల‌ను వేధింపుల‌కు గురిచేయ‌డం చూస్తూ సైలెంట్ గా ఉండలేకపోతున్నా . ఈ తప్పుడు కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న‌వారు ఇర‌వై నాలుగు గంట‌ల్లోగా వాటిని సోష‌ల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నాను. లేదంటే చ‌ట్ట‌ప్ర‌కారమే  వారిపై పోరాటం చేస్తాను. నా జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే అధికారం ఇత‌రుల‌కు లేదు. మన జీవితం మనది, మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి" అంటూ ఈ పోస్ట్‌లో ర‌ష్మిక మంద‌న్న పేర్కొన్న‌ది. ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

 

Advertisement
Advertisement