త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | భూమా దేవి పాత్ర‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను : ర‌ష్మిక మంద‌న్నా

Rashmika Mandanna | తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్-2025లో ప్రముఖ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna)కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆమె నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రంలో నటనకు గౌర‌వాన్ని అందుకుంది.

P

Entertainment | Published On Mar 7, 2026, 8.07 pm IST

Rashmika Mandanna | భూమా దేవి పాత్ర‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను : ర‌ష్మిక మంద‌న్నా
Advertisement

Rashmika Mandanna | తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్-2025లో ప్రముఖ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna)కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆమె నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రంలో నటనకు గౌర‌వాన్ని అందుకుంది. ఈ అవార్డు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రష్మిక తెలిపింది. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో తాను పోషించిన భూమా దేవి పాత్ర తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుందని చెప్పింది.

ఈ పాత్రకు ప్రేక్షకులు చూపిన ఆదరణతో పాటు ఈ అవార్డు రావడం తనకు మరింత ప్రత్యేకంగా అనిపిస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran), నిర్మాతలు విద్యా కొప్పినీడి (Vidya Koppineedi), ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni), అలాగే చిత్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ (Geetha Arts), ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి రష్మిక ధన్యవాదాలు తెలిపింది. తాను పోషించిన భూమా దేవి పాత్రను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పేర్కొంది. ఈ గౌరవాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)లకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ఈ అవార్డు విజేతలను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రకటించారు. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (Naga Chaitanya) ఎంపికయ్యారు. ఆయన నటించిన ‘తండేల్’ (Thandel) చిత్రానికి ఈ అవార్డు లభించడంతో పాటు అదే సినిమా జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం అవార్డును కూడా అందుకుంది. అదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాకు ఈ ఏడాది ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డు లభించింది.

Advertisement
Advertisement