త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh | బాలీవుడ్ హీరోకు బెదిరింపులు – డ‌బ్బులు డిమాండ్ చేస్తూ….

బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ గుర్తుతెలియ‌ని వ్య‌క్తి వాయిస్ నోట్ పంపించారు. ఈ ఘ‌ట‌న‌పై ర‌ణ‌వీర్‌సింగ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ర‌ణ‌వీర్ సింగ్ నివాసం వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌తాను క‌ట్టుదిట్టం చేశారు.

N

Entertainment | Published On Feb 10, 2026, 8.02 pm IST

Ranveer Singh | బాలీవుడ్ హీరోకు బెదిరింపులు – డ‌బ్బులు డిమాండ్ చేస్తూ….
Advertisement

Ranveer Singh | బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్‌సింగ్‌కు బెదిరింపులు వ‌చ్చాయి. కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తూ గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఆయ‌న‌కు వాట్సాప్ వాయిస్ నోట్ పంపించారు. ఈ బెదిరింపుల‌కు సంబంధించి ర‌ణ‌వీర్‌సింగ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ర‌ణ‌వీర్ సింగ్ కంప్లైంట్‌తో ఆయ‌న నివాసం వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.
బెదిరింపుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వాడిగా వాయిస్ నోట్‌లో పేర్కొన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ణ‌వీర్ కంప్లైంట్‌పై పోలీసులు ఇన్వేస్టిగేష‌న్‌ను ముమ్మ‌రం చేశారు. అప‌రిచిత వ్య‌క్తిని క‌నుగోనే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు తెలిసింది.

ప‌ది రోజులు కాక‌ముందే...

కాగా ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనే నివాసం వ‌ద్ద పోలీసుల‌తో పాటు వారి వ్య‌క్తిగ‌త సిబ్బంది భారీ స్థాయిలో మెహ‌రించ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లే బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి నివాసంపై కాల్పుల జ‌రిగాయి. ఈ సంఘ‌ట‌న జ‌రిగి ప‌ది రోజులు కూడా కాక‌ముందే ర‌ణ‌వీర్‌సింగ్‌కు బెదిరింపులు రావ‌డం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫిబ్ర‌వ‌రి 1న రోహిత్ శెట్టి నివాసంపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి గాయాలు కాలేదు.

Advertisement

తాజావార్తలు

Advertisement