Ramayana Ott Deal | రామాయణ రూ.1000కోట్ల డీల్ సాధ్యమేనా?
Ramayana Ott Deal | ఓటీటీ మార్కెట్ సినిమా నిర్మాణం, మార్కెటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరింత పెరిగింది. బడా స్టార్‌లతో తెరకెక్కే చిత్రాలపై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి.
Entertainment | Published On Apr 4, 2026, 6.00 pm IST
- రూ.4వేలకోట్లతో తెరకెక్కుతోన్న మూవీ
- రూ.700కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా టాక్
- ప్రాజెక్ట్‌పై కనిపించని బజ్!
Ramayana Ott Deal | ఓటీటీ మార్కెట్ సినిమా నిర్మాణం, మార్కెటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరింత పెరిగింది. బడా స్టార్‌లతో తెరకెక్కే చిత్రాలపై ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ‘రామాయణ’ మూవీగా పేర్కొంటున్నారు. ఈ చిత్రానికి భారీ ప్రమోషన్ జరుగుతోంది. సమాచారం మేరకు.. సినిమా ఓటీటీ హక్కుల కోసం నిర్మాతకు రూ.700 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికీ, దాన్ని తిరస్కరించారని తెలుస్తోంది. సినిమా ఓటీటీ హక్కులను రూ.1000 కోట్లకు అమ్మాలనే లక్ష్యం పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ పెట్టిన నేపథ్యంలోనే ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వెయ్యి కోట్ల ఓటీటీ డీల్ సాధ్యమేనా? అంటే.. కష్టమేననే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలకు ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుత దశలో ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద బజ్ కనిపించడంలేదు. దీంతో డిజిటల్ హక్కులకు ఇంత భారీ ధర నిర్ణయించడం కష్టం అని భావిస్తున్నారు. చిత్రంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కన్నడ మార్కెట్‌లో యశ్‌కు ఉన్న క్రేజ్ కొంత ఉపయోగపడవచ్చు. అయితే, అంత మాత్రానికే వెయ్యి కోట్ల డీల్ సాధ్యమవుతుందా అనే సందేహాలు ఉన్నాయి. ఎస్‌ఎస్ రాజమౌళి వంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించినట్లయితే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇటీవల విడుదలైన వీడియో కంటెంట్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఇప్పటికీ ఈ చిత్రంపై హైప్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వెయ్యి కోట్ల డిమాండ్ కాస్త ఎక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సినిమా క్వాలిటీని, రెస్పాన్స్‌ను అందుకుంటే డీల్ సాధ్యమేననేని, ప్రస్తుతానికి ఇది ఊహాగానాలేనని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



