త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan Peddi | మోదీ నోట పెద్ది మాట – రామ్‌చ‌ర‌ణ్ కామెంట్స్ వైర‌ల్

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మేక‌ర్స్ గురువారం ఢిల్లీలో ఓ ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు. పెద్ది గురించి ప్ర‌ధాని మోదీ ఆరా తీసిన ఓ సంఘ‌ట‌న‌ను రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌తో పంచుకున్నారు.

N

Entertainment | Published On May 28, 2026, 7.30 pm IST

Ram Charan Peddi | మోదీ నోట పెద్ది మాట –  రామ్‌చ‌ర‌ణ్ కామెంట్స్ వైర‌ల్
Advertisement

Ram Charan Peddi |  ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో పెద్ది హ‌వా న‌డుస్తోంది. ఈ తెలుగు మూవీ గురించి ప్ర‌ధాని మోదీ కూడా ఆస‌క్తి చూపార‌ట‌. ఈ విష‌యాన్ని హీరో రామ్‌చ‌ర‌ణ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. పెద్ది మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గురువారం ఢిల్లీలో మేక‌ర్స్ ఓ ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ప్ర‌ధాని మోదీని క‌లిసిన‌ప్పుడు పెద్ది గురించి త‌న‌ను అడిగార‌ని ఢిల్లీ వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్ చెప్పాడు.

గొప్ప ఎంట‌ర్‌టైన‌ర్‌...

రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ.... "గత రెండున్నర సంవత్సరాలుగా ఎంతో డెడికేషన్‌తో పెద్ది సినిమా చేశాం. ఆడియెన్స్‌లో స్ఫూర్తిని నింపే గొప్ప ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ నిలుస్తుంది. ఇది మట్టి వాసన ఉన్న కథ. గతంలో నేను చేసిన రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఆ లిస్ట్‌లో పెద్ది కూడా చేరుకుంది" అని అన్నారు

మోదీ చెప్పిన క‌థ‌...

"నేను ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు పెద్ది మూవీలో దేని గురించి చెబుతున్నారు అని అడిగారు. గ్రామాలకు సాధికారతను అందించే విక‌సిత్ భార‌త్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. అప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వెస్ట్ బెంగాల్‌లో ఎన్నిక‌ల‌ ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు పైన జెర్సీ, కింద లంగోటా ధరించి కనిపించారని, వాళ్లు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చామని చెప్పారట. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మొహమ్మద్ అనే వ్యక్తి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా నేష‌న‌ల్ టీమ్‌కు ఆడాడు. ఇప్పుడు అదే గ్రామం నుంచి 80 శాతం మంది ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఒక్క వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో ఆ సంఘ‌ట‌న చూపించింద‌ని ప్ర‌ధాని మోదీ నాతో అన్నారు.  పెద్ది కూడా అలాంటి క‌థే అని నేను ప్రైమ్ మినిస్ట‌ర్‌కు చెప్పాను. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు తన ఐడెంటిటీ కోసం ఎలా పోరాడాడనేది పెద్దిలో చూస్తారు. పెద్ది పాత్రకు ఏం కావాలో అంతా ప్రాణం పెట్టి చేశాను. జూన్ 4న సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్లలో చూసి సపోర్ట్ చేయాలి" అని రామ్‌చ‌ర‌ణ్ అన్నారు.
పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో శృతి హాస‌న్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

 

Advertisement
Advertisement