త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మంత్రి తుమ్మ‌ల‌ను ప‌క్క‌కు నెట్టి.. పీసీసీ చీఫ్‌ను ద‌గ్గ‌రగా తీసుకున్న సీఎం రేవంత్..

CM Revanth Reddy | హైద‌రాబాద్ న‌గ‌రంలోని అమీర్‌పేట మైత్రివ‌నం జంక్ష‌న్‌లో ఉమ్మ‌డి ఏపీ దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

S

Telangana | Published On May 28, 2026, 8.01 pm IST

CM Revanth Reddy | మంత్రి తుమ్మ‌ల‌ను ప‌క్క‌కు నెట్టి.. పీసీసీ చీఫ్‌ను ద‌గ్గ‌రగా తీసుకున్న సీఎం రేవంత్..
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని అమీర్‌పేట మైత్రివ‌నం జంక్ష‌న్‌లో ఉమ్మ‌డి ఏపీ దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విగ్ర‌హాం వ‌ద్ద‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప‌క్క‌నే మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, ఆయ‌న వెనుకాల చిన్న శ్రీశైలం యాద‌వ్ నిల్చుని ఉన్నారు.

మంత్రి తుమ్మల‌కు ఎడ‌మ వైపున టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ నిల్చుని ఉన్నారు. ఇక సీఎం క‌ల్పించుకుని.. సైగ‌ల‌తో పీసీసీ చీఫ్‌ను త‌న ద‌గ్గ‌రికి రావాల‌ని సూచించారు. అదే స‌మ‌యంలో మంత్రి తుమ్మ‌ల‌ను సీఎం ప‌క్క‌కు నెట్టి.. మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. త‌న ప‌క్క‌నే నిల్చోపెట్టుకున్నారు. ఇక విగ్రహావిష్క‌ర‌ణ అనంత‌రం కూడా గ్రూపు ఫొటో దిగే స‌మ‌యంలోనూ సీఎం మ‌హేశ్ కుమార్ గౌడ్ త‌న ప‌క్క‌నే నిల్చోపెట్టుకున్నారు.

ఇక స‌భా వేదిక‌పై ఆశీనులైన అనంత‌రం కూడా టీ పీసీసీ చీఫ్‌తో సీఎం సంభాషిస్తూనే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌తో పాటు మ‌రో నేత మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌ రావు మాట్లాడే వ‌ర‌కు సీఎం, పీసీసీ చీఫ్ మాట్లాడుతూనే ఉన్నారు. అంతలోనే త‌న వంతు రావ‌డంతో మ‌హేశ్ కుమార్ స‌భా వేదిక‌పై ప్ర‌సంగించేందుకు వెళ్లిపోయారు.

గ‌త కొద్ది రోజులుగా సీఎం, టీపీసీసీ చీఫ్ మ‌ధ్య దూరం నెల‌కొంద‌ని ప‌లు వార్తా క‌థ‌నాలు ప్ర‌చురిత‌మైన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు సీఎం మ‌ధ్య ఎలాంటి గ్యాప్ లేద‌ని మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొంటూ వ‌స్తున్నారు. కావాల‌నే ప‌ని క‌ట్టుకుని కొన్ని మీడియా సంస్థ‌లు, కొంత‌మంది వ్య‌క్తులు ప‌నిక‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మ‌హేశ్ కుమార్ మండిప‌డుతున్నారు. మొత్తానికి ఈ గ్యాప్‌ను పూరించేందుకే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ వేదిక‌గా.. పీసీసీ చీఫ్‌ను ద‌గ్గ‌ర‌కు తీశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గ్యాప్ లేద‌నే సంకేతాన్ని ఇచ్చార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement
Advertisement