త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGIIC | రాయ‌దుర్గంలో ఎక‌రం భూమి రూ. 237 కోట్లు

TGIIC | హైద‌రాబాద్ న‌గ‌రంలోని టీజీఐఐసీ భూముల వేలం స‌రికొత్త రికార్డును సృష్టించింది. గురువారం రాయ‌దుర్గం భూముల‌కు వేలం నిర్వ‌హించ‌గా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఎక‌రం భూమి రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికింది.

S

Hyderabad | Published On May 28, 2026, 6.28 pm IST

TGIIC | రాయ‌దుర్గంలో ఎక‌రం భూమి రూ. 237 కోట్లు
Advertisement

TGIIC | త్రినేత్ర‌.న్యూస్ :  హైద‌రాబాద్ న‌గ‌రంలోని టీజీఐఐసీ భూముల వేలం స‌రికొత్త రికార్డును సృష్టించింది. గురువారం రాయ‌దుర్గం భూముల‌కు వేలం నిర్వ‌హించ‌గా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఎక‌రం భూమి రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పాన్ మ‌క్తాలో ఒక ఎక‌రం భూమి ధ‌ర రూ. 237 కోట్లు ప‌లికింది. ఇది ప్ర‌భుత్వ నిర్ణీత క‌నీస ధ‌ర రూ. 139 కోట్ల కంటే 70.5 శాతం ఎక్కువ‌. రాయదుర్గం సర్వే నం.83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం కొన‌సాగింది. ఇక ఈ భూమిని దక్కించుకునేందుకు ప్ర‌ముఖ డెవ‌ల‌ప‌ర్లు పోటీ ప‌డ్డారు. ఈ వేలం ద్వారా ప్ర‌భుత్వానికి మొత్తం రూ. 1490.73 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. గతేడాది ఇదే ప్రాంతంలో రూ.177 కోట్ల రికార్డు ధర ప‌లికింది ఎక‌రం భూమి.

Advertisement
Advertisement