త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka Techie Death | భార్యాపిల్లల ముందే ఊహించని ఘోరం: జాబ్ వదిలి వ్యవసాయం వైపు అడుగులు.. పిడుగు రూపంలో టెకీని బలితీసుకున్న విధి

ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేయాలనుకున్న ఆ టెకీని విధి చిన్నచూపు చూసింది. భార్యాపిల్లలతో కలిసి పొలం చూసేందుకు వెళ్లగా పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయాడు.

J

Crime | Published On May 28, 2026, 7.14 pm IST

Karnataka Techie Death | భార్యాపిల్లల ముందే ఊహించని ఘోరం: జాబ్ వదిలి వ్యవసాయం వైపు అడుగులు.. పిడుగు రూపంలో టెకీని బలితీసుకున్న విధి
Advertisement

Karnataka Techie Death | త్రినేత్ర.న్యూస్ : చేతిలో లక్షలు జీతం తెచ్చిపెట్టే సాఫ్ట్‌వేర్ జాబ్ (Software job).. అయినా వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. కొత్తగా అగ్రికల్చర్ రంగంలో అడుగుపెట్టి తన కలలను సాకారం చేసుకునే పనిలో పడ్డాడు. కానీ, విధికి అతని ప్లాన్స్ నచ్చలేదనుకుంట.. పిడుగు రూపంలో ఆ టెకీ ప్రాణాలను బలితీసుకుంది. భార్య, కొడుకుతో కలిసి కర్ణాటక (Karnataka) లోని మైసూరులో ఓ వ్యవసాయ భూమిని చూసేందుకు వెళ్లిన రోషన్ బాలకృష్ణ (43) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

జాబ్ వదిలేసి.. అగ్రికల్చర్ ఫీల్డ్‌లోకి..

కొడగు జిల్లా మడికేరికి చెందిన రోషన్ బాలకృష్ణ.. ఇటీవల తన ఐటీ జాబ్‌ (IT Job) కు రాజీనామా చేశాడు. స్నేహితుడితో కలిసి అగ్రికల్చర్ ఫీల్డ్ (Agriculture field) లోకి ఎంట్రీ ఇచ్చాడు. రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను (Farming equipment) మార్కెటింగ్ చేస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో తన బిజినెస్ చూసుకుంటున్నాడు. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.

మామిడికాయలు కోస్తుండగా..

వ్యవసాయ విస్తరణలో భాగంగా కొత్తగా భూమిని కొనుగోలు చేసేందుకు రోషన్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే తన భార్య, కొడుకుతో కలిసి మైసూరు (Mysuru) శివార్లలోని ఓ పొలాన్ని పరిశీలించేందుకు వెళ్లాడు. ఆ పొలం దగ్గర ఉన్న ఓ మామిడి చెట్టు నుంచి కాయలు కోసేందుకు రోషన్ ఆగాడు. అదే సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రోషన్ తో పాటు ఉన్న మరో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

రూ.5 లక్షల పరిహారం

టెకీ రోషన్ మృతిపై స్పందించిన జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు.. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించే ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోషన్ కుటుంబానికి మొత్తం రూ. 5 లక్షల పరిహారం (Compensation) చెల్లించనున్నారు. ఇందులో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) నుంచి రూ. 4 లక్షలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి ఒక లక్ష అందజేయనున్నట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.

Advertisement
Advertisement