Peddi Run Time | పెద్ది మూవీ రన్ టైమ్ రివీల్ – సోలో హీరోగా రామ్‌చరణ్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్…
రామ్‌చరణ్ పెద్ది రన్‌టైమ్ రివీలైంది. సోలో హీరోగా రామ్‌చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ రన్ టైమ్‌తో రిలీజ్ కానున్న సినిమాగా పెద్ది రికార్డును క్రియేట్ చేయబోతుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ జూన్ 4న విడుదల అవుతోంది.
Entertainment | Published On May 2, 2026, 7.36 pm IST
Peddi Run Time | ఈ ఏడాది టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటింగ్ మూవీస్‌లో ఒకటిగా రామ్‌చరణ్ పెద్ది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ శుక్రవారం ఖరారు చేశారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా పెద్ది థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రోజు ముందే రామ్‌చరణ్ మూవీ ప్రీమియర్స్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఓవర్‌సీస్ బుకింగ్స్...
కాగా పెద్ది మూవీ ఓవర్‌సీస్ బుకింగ్స్ నెల రోజులు ముందుగానే ఓపెన్ కాబోతున్నాయి. ఈ వారంలోనే టికెట్ల అమ్మకాలను మొదలుపెట్టబోతున్నారు. ఓవర్‌సీస్ థియేటర్ల లిస్ట్‌ను రివీల్ చేశారు. ఇందులో పెద్ది మూవీ రన్ టైమ్ ఎంతన్నది కూడా వెల్లడించారు.
రంగస్థలం రికార్డ్...
రెండు గంటల యాభై ఆరు నిమిషాల రన్‌టైమ్‌తో పెద్ది ప్రేక్షకుల ముందుకురానుందట. సోలో హీరోగా రామ్‌చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ రన్‌టైమ్‌తో రిలీజ్ కాబోతున్న మూవీగా పెద్ది నిలవబోతుంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన రంగస్థలం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలం రికార్డును పెద్ది బ్రేక్ చేయబోతున్నట్లు సమాచారం.
సెకండ్ లాంగెస్ట్ రన్‌టైమ్...
ఓవరాల్‌గా రామ్‌చరణ్ కెరీర్‌లో సెకండ్ లాంగెస్ట్ రన్‌టైమ్ మూవీగా పెద్ది రిలీజ్ కాబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూడు గంటల రెండు నిమిషాల రన్‌టైమ్‌తో విడుదలైంది. రామ్‌చరణ్ కెరీర్‌లోనే జూన్‌లో రిలీజ్ కాబోతున్న మొదటి మూవీ కూడా ఇదే కావడం గమనార్హం.
జాన్వీకపూర్ హీరోయిన్...
లార్జర్ దేన్ లైఫ్‌తో కూడిన కథ కావడంతోనే రన్‌టైమ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో శృతి హాసన్ కనిపించబోతుంది.
ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడు రామ్‌చరణ్.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Janhvi Kapoor | పల్లెటూరు అమ్మాయిలంటే చిన్నచూపా? – పెద్దిలో జాన్వీ రోల్‌పై నెటిజన్ల ఫైర్
మే 19, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



