Rakul Preet Singh | అలాంటి సినిమా కోసం వెయిటింగ్ – టాలీవుడ్ రీఎంట్రీపై రకుల్ కామెంట్స్
Rakul Preet Singh |టాలీవుడ్ (Tollywood)రీఎంట్రీపై రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాహుబలి లాంటి సినిమా చేయాలని ఉందని అన్నది. అలాంటి సినిమాతోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తానని చెప్పింది. రకుల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Entertainment | Published On Dec 19, 2025, 3.54 pm IST
రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్‌లో (Tollywood)టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. ఎన్టీఆర్(Ntr), రామ్‌చరణ్(RamCharan), అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. యాక్టింగ్ పరంగా అంతగా ఆకట్టుకోకపోయినా గ్లామర్‌తో చాలా ఏళ్లు పాటు టాలీవుడ్‌ను ఏలింది. కొత్త హీరోయిన్ల పోటీతో పాటు పరాజయాలు రకుల్ జోరుకు బ్రేకులు వేశాయి. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. చివరగా మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌తో కలిసి కొండపొలం సినిమా చేసింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తర్వాత తెలుగులో రకుల్‌కు ఒక్క అవకాశం రాలేదు. దాంతో బాలీవుడ్‌కు షిప్టయిపోయింది. నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకున్న రకుల్ ఓ వైపు ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూనే సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో రకుల్ కెరీర్ సాఫీగా సాగడం లేదు.ఇటీవలే రిలీజైన దే దే ప్యార్ దే 2 పై బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
రీఎంట్రీ ఎప్పుడంటే?
తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్న రకుల్ ప్రీత్‌సింగ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో రకుల్ పాల్గొన్నది.ఈ సందర్భంగా టాలీవుడ్ రీఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగులో బాహుబలి లాంటి సినిమా చేయాలనుంది. అదే నా డ్రీమ్ రోల్. అలాంటి సినిమా కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పింది. అంతే కాకుండా తెలుగులో కొన్ని కథలు వింటున్నానని అన్నది. ఇన్‌డైరెక్ట్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి తాను రెడీ అని చెప్పకనే రకుల్ చెప్పిందని నెటిజన్లు అంటున్నారు. కొన్నాళ్లుగా రకుల్ హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు చెబుతున్నారు. తెలుగులో సినిమా చేసేందుకు రకుల్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుందటా. దాదాపు ఓ ఆఫర్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో సీనియర్ హీరోలకు జోడీగా కథానాయికలు దొరకడం కష్టంగానే మారింది. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తో పాటు మరికొందరు హీరోల సినిమాల్లో నాయికలను సెలెక్ట్ చేయడం దర్శకులకు సవాల్‌గా మారింది. ఆ హీరోల సినిమాలకు రకుల్ మంచి ఛాయిస్ అవుతుందని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. అందులోనూ తెలుగు సినిమాలు చేసిన అనుభవం కూడా చాలానే ఉంది. అయినా చాలా మంది దర్శకులు రకుల్ పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ట్రాక్ రికార్డ్ ఆమెకు మైనస్‌గా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా ప్రస్తుతం హిందీలో పతి పత్నీ ఔర్ వో దో సినిమా చేస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. అలాగే తమిళంలో ఇండియన్ 3 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



