Rajinikanth | పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి రజనీకాంత్ ఫిదా – బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన సూపర్ స్టార్
తనకు దొరికిన నలభై ఐదు తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న పద్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి రజనీకాంత్ ఫిదా అయ్యారు. ఆమెను సత్కరించడమే కాకుండా ఓ బంగారు గొలుసును బహుమతిగా అందజేశారు.
Entertainment | Published On Feb 3, 2026, 4.45 pm IST
Rajinikanth | ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిదా అయ్యారు. ఆమెను తన ఇంటికి పిలిపించి సత్కరించడమే కాకుండా బంగారు గొలుసును బహుమతిగా అందజేశారు. పద్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు చెన్నై మహానగర పాలక సంస్థలో పనిచేస్తోన్నారు. జనవరి 11న రోడ్డు శుభ్రం చేస్తుండగా 45 తులాల బంగారు సంచి దొరికింది. ఆ బంగారం విలువ ఇరవై ఐదు లక్షలపైనే ఉంటుందట. ఆ బంగారాన్ని పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది పద్మ. ఆమె మంచి మనసుపై నెటిజన్లతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బంగారు గొలుసు బహుమానం...
తాజాగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ మంచితనానికి రజనీకాంత్ ఫిదా అయ్యారు. ఆమెను తన ఇంటికి పిలిచి స్వయంగా సత్కరించారు. పద్మకు బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు రజనీకాంత్. భర్త, పిల్లలతో కలిసి రజనీకాంత్‌ను కలిసింది పద్మ. రజనీకాంత్‌ను పద్మ కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
పద్మకు ఇరవై ఐదు వేల నగదు సాయాన్ని కూడా రజనీకాంత్ అందించినట్లు సమాచారం. ఆమె పిల్లల చదువుకు కూడా సహకారాన్ని అందిస్తానని సూపర్‌స్టార్ హామీ ఇచ్చినట్లు చెబుతోన్నారు.
పద్మకు ఇటీవలే లక్ష రూపాయల నగదు బహుమతిని అందించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. పోస్టల్ శాఖ కూడా పద్మను గౌరవిస్తూ ఆమె పేరుతో ప్రత్యేకంగా ఓ పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేశారు.
సంబంధిత వార్తలు

Kaviya Maran | కోలీవుడ్ రాక్‌స్టార్‌తో ఏడడుగులు వేయబోతున్న కావ్య పాప – పెళ్లి ఎప్పుడు..ఎక్కడంటే?
మే 21, 2026

Meenakshi Chaudhary | సంక్రాంతి హీరోయిన్గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
మే 20, 2026

Jayam Ravi | నెలకు నలభై లక్షలు ఇవ్వాల్సిందే – జయం రవి నుంచి భరణం కోరిన భార్య – తెరపైకి అగ్ర హీరో పేరు…
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



