Varanasi Release Date | మహేష్‌బాబు వారణాసి రిలీజ్ డేట్ ఇదేనా – జక్కన్న వెరైటీ ప్రమోషన్స్
మహేష్‌బాబు వారణాసి మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వారణాసి రిలీజ్ డేట్‌ను హోర్డింగ్స్ ద్వారా డిఫరెంట్‌గా రివీల్ చేశారు.
Entertainment | Published On Jan 29, 2026, 6.54 pm IST
Varanasi Release Date | మహేష్‌బాబు పాన్ వరల్డ్ మూవీ వారణాసి ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడన్నది కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను డిఫరెంట్‌గా మేకర్స్ రివీల్ చేశారు. టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. కాగా ఈ పాన్ వరల్డ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైనట్లు సమాచారం.
వారణాసి టౌన్‌లో...
2027 ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ అంటూ రారి ఉన్న కొన్ని హోర్డింగ్స్ వారణాసి సిటీలో గురువారం దర్శనమిచ్చాయి. ఈ పోస్టర్లు మహేష్‌బాబు వారణాసి మూవీకి సంబంధించినవేనని నెటిజన్లు చెబుతోన్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీ వారణాసి సిటీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగనుంది. టైటిల్ కూడా వారణాసి అనే పెట్టారు. దాంతో రిలీజ్ డేట్‌ను కూడా వారణాసి సిటీలోనే ఇలా డిఫరెంట్‌గా మేకర్స్ రివీల్ చేశారని అంటున్నారు. జక్కన్న ప్రమోషన్స్ ఎప్పుడూ వెరైటీ అని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో షూటింగ్...
ప్రస్తుతం వారణాసి షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. బుధవారం నుంచి మొదలైన లేటెస్ట్ షెడ్యూల్‌లో మహేష్‌బాబు, ప్రియాంక చోప్రాలపై టాకీ పార్ట్‌తో పాటు ఓ హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను రాజమౌళి చిత్రీకరించబోతున్నారు.
రిలీజ్‌కు ముందే రికార్డ్...
వారణాసి మూవీని భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మెట్‌లో షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా వారణాసి రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సీనియర్ ప్రొడ్యూస్ కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



