Rajamouli Son | నిర్మాతగా మారిన రాజమౌళి కొడుకు – మలయాళ హీరోతో తెలుగు మూవీ
రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రొడ్యూసర్‌గా మారాడు. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్‌తో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ పేరుతో ఓ ఫాంటసీ మూవీని నిర్మిస్తున్నారు. ఆదివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
Entertainment | Published On Feb 1, 2026, 5.36 pm IST
Rajamouli Son | దిగ్గజ దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇస్తోన్నారు. పుష్ప 2 ఫేమ్ ఫహాద్ ఫాజిల్‌తో ఓ ఫాంటసీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు.
ఆదివారం ప్రారంభం...
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతోన్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్‌ను ఆదివారం (ఫిబ్రవరి1)న ప్రారంభమైంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేశారు. ఈ సెట్‌కు ఫహాద్ ఫాజిల్ అభిమానులు భారీగా వచ్చారు. తన మీద అభిమానంతో షూటింగ్ సెట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ను చూసి హ్యాపీగా ఫీలయ్యాడు ఫహాద్ ఫాజిల్. షూటింగ్ నుంచి కాసేపు బ్రేక్ ఇచ్చి అందరిని పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు.
వారణాసికి నిర్మాతగా...
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీతో శశాంక్ యేలేటి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న తొలి మూవీ ఇది. మలయాళ మూవీ ప్రేమలును తెలుగులో రిలీజ్ చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు కార్తికేయ. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌తో ప్రొడ్యూసర్‌గా మారుతున్నాడు. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌తో పాటు మహేష్‌బాబు వారణాసి మూవీకి కూడా కార్తికేయ ఓ నిర్మాతగా వ్యవహరించబోతుండటం గమనార్హం. ఈ సినిమాకు రాజమౌళి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.
పుష్ప 2తో విలన్‌గా....
పుష్ప 2 మూవీతో విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఫహాద్ ఫాజిల్. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో తన విలనిజంతో అదరగొట్టాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌తో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
ఏప్రిల్ లోగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ ప్రకటించారు. కాల భైరవ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్దంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



