త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | న‌టికి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగ‌న కౌంట‌ర్‌

Rahul Gandhi | రక్షాబంధన్‌ యాడ్‌లో (Rakhi ad outfit) దుస్తుల ఎంపిక విష‌యంలో బాలీవుడ్ న‌టి కృతిస‌న‌న్ (Kriti Sanon)ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో న‌టికి ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మ‌ద్ద‌తుగా నిలిచారు. ఒక మహిళ ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఎంపిక అని తెలిపారు. రాహుల్ స్పంద‌న‌కు బీజేపీ ఎంపీ కంగ‌న ర‌నౌత్ (Kangana Ranaut) కౌంట‌ర్ ఇచ్చారు. "బ్రో, వెయిట్.. భారత్ మాతా కీ జై. షురూ కర్తే హై" అంటూ ఎద్దేవా చేశారు.

D

Movies | Published On Aug 26, 2026, 10.06 am IST

Rahul Gandhi | న‌టికి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ రాహుల్ గాంధీ.. బ్రో వెయిట్ అంటూ కంగ‌న కౌంట‌ర్‌
Advertisement

Rahul Gandhi | ప్ర‌ముఖ‌ ఆభరణాల బ్రాండ్ గివా (GIVA) రూపొందించిన రక్షాబంధన్‌ యాడ్‌లో (Rakhi ad outfit) బాలీవుడ్ న‌టి కృతిస‌న‌న్ (Kriti Sanon) వేసుకున్న దుస్తుల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. బ్రాలెట్‌ తరహా బ్లౌజ్‌, కేప్‌, డ్రేప్డ్‌ స్కర్ట్‌తో ఆమె కనిపించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. రక్షాబంధన్‌ వంటి సంప్రదాయ పండగకు సంబంధించిన ప్రకటనలో ఇలాంటి వస్త్రధారణ ఏంటంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రేమో మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే హ‌క్కు ఉందంటూ కృతికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

ఈ వివాదంపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఒక మహిళ ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఎంపిక అని తెలిపారు. స్వేచ్ఛగా జీవిస్తున్న మహిళలను ఆన్‌లైన్ ట్రోలింగ్ చేయడం ఆపాలంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాహుల్ రాసుకొచ్చారు. త‌న పోస్టుకు '#SmashThePatriarchy' (పితృస్వామ్య వ్యవస్థను కూల్చేయాలి) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

బ్రో.. వెయిట్‌.. రాహుల్‌కు కంగ‌న కౌంట‌ర్‌

కృతి యాడ్‌పై ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతుండ‌గా ఈ వ్య‌వ‌హారంలోకి రాహుల్ ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వివాదం కాస్తా బీజేపీ Vs కాంగ్రెస్ మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారితీసింది. రాహుల్ స్పందన‌పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, బీజేపీ ఎంపీ కంగ‌న ర‌నౌత్ (Kangana Ranaut) తీవ్రంగా స్పందించారు. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని చెబుతూనే.. కొన్ని సందర్భాల్లో తగిన పరిమితులను పాటించడం అవసరమని ఇప్ప‌టికే త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన కంగ‌న‌.. రాహుల్ పోస్టుకు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "బ్రో, వెయిట్.. భారత్ మాతా కీ జై. షురూ కర్తే హై" అంటూ ఎద్దేవా చేశారు.

Actor and BJP MP Kangana Ranaut hit back at Congress leader Rahul Gandhi over his “smash the patriarchy” remark.

ట్రోల్స్‌పై కృతి స్పంద‌న ఇదీ..

ఈ విమర్శలపై కృతి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇప్ప‌టికే స్పందించిన విష‌యం తెలిసిందే. రక్షాబంధన్‌ అంటే కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య బంధం మాత్రమే కాదని.. పరస్పరం ఒకరికొకరు అండగా నిలిచే అనుబంధానికి ప్రతీక అని పేర్కొంది. తాను, తన సోదరి ప్రతి ఏడాది ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని తెలిపింది. అన్న తనను రక్షించినట్లే తాము కూడా ఒకరినొకరు కాపాడుకోగలమనే నమ్మకం తమకుందని చెప్పింది. తమ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కోసం పరస్పరం ప్రార్థించుకుంటామని కృతి వెల్లడించింది. తమ పెంపుడు కుక్కలను కూడా కుటుంబంలో భాగంగానే భావిస్తామని.. వాటి కోసం కూడా ప్రార్థిస్తామని పేర్కొంది. మహిళ ఏం ధరిస్తుందనే అంశాన్ని ఆమె సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవానికి కొలమానంగా చూడటం సరికాదని కృతి స్పష్టం చేసింది. కాలానుగుణంగా సంప్రదాయ వస్త్రధారణలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. అలాంటప్పుడు మహిళల సంస్కృతిని కేవలం వారి దుస్తులను చూసి ఎందుకు నిర్ణయిస్తున్నారని ప్రశ్నించింది. ‘సంస్కృతి, సంప్రదాయాలు మహిళ హృదయంలో ఉంటాయి.. ఆమె దుస్తుల నెక్‌లైన్‌లో కాదు’ అంటూ విమర్శకులకు కృతి గట్టి సమాధానమిచ్చింది.

Also Read..

సొంత ఇంట్లో దొంగ‌త‌నం చేసి.. ప్రేయ‌సికి ఐఫోన్ కొనిచ్చాడు..

ముందు ప‌దో త‌ర‌గ‌తి పాస‌వ్వండి.. బీహార్ సీఎం, విప‌క్ష నేత‌కు ప్ర‌శాంత్ కిషోర్ స‌వాల్‌

ఆగిఉన్న కంటైన‌ర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

Advertisement
Advertisement