త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashii Khanna | లోకేష్ క‌నగరాజ్‌తో రాశీఖ‌న్నా మీటింగ్ – ఐకాన్ స్టార్ సినిమాలో ఛాన్స్‌!

అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ రాబోతుంది. ఏఏ 23 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఇటీవ‌ల ఓ వీడియో గ్లింప్స్ ద్వారా అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా రాశీఖ‌న్నా ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Mar 12, 2026, 2.47 pm IST

Raashii Khanna | లోకేష్ క‌నగరాజ్‌తో రాశీఖ‌న్నా మీటింగ్ – ఐకాన్ స్టార్ సినిమాలో ఛాన్స్‌!
Advertisement

Raashii Khanna | రాశీఖ‌న్నా బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ త‌ర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోన్నారు. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. ఏఏ23 అనే వ‌ర్కింగ్ టైటిట్‌తో ఇటీవ‌ల ఈ మూవీని అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. గ్లింప్స్‌తోనే బాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు అన్ని భాష‌ల్లో ఈ మూవీపై భారీగా క్రేజ్ ఏర్ప‌డింది.

స్క్రిప్ట్ ప‌నులు ఎండింగ్‌...

ప్ర‌స్తుతం ఏఏ 23 స్క్రిప్ట్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. జూలై లేదా ఆగ‌స్ట్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో రాశీ ఖ‌న్నా ఓ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

రాశీఖ‌న్నా...

ఇటీవ‌లే డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌ను రాశీఖ‌న్నా ప్ర‌త్యేకంగా క‌లిసింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏఏ23 స్క్రిప్ట్ డిస్క‌ష‌న్ కోస‌మే వీరిద్ద‌రి మీటింగ్ జ‌రిగింద‌ట‌. అల్లు ఫ్యామిలీతో రాశీఖ‌న్నాకు స్పెష‌ల్ బాండింగ్ ఉంది. ఇటీవ‌ల అల్లు శిరీష్ పెళ్లి వేడుక‌లో టాలీవుడ్ హీరోయిన్ల నుంచి కేవ‌లం రాశీఖ‌న్నా మాత్ర‌మే అటెండ్ కావ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని రాశీఖ‌న్నాకు ఛాన్స్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు. రాశీఖ‌న్నాతో పాటు ఇందులో మ‌రో హీరోయిన్ కూడా ఉండ‌నుంద‌ని తెలిసింది.
అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రానున్న‌ట్లు చెబుతున్నారు. ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌తో పాటు షూటింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. బ‌న్నీ, లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అట్లీతో...

ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో బ‌న్నీ ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేస్తున్నాడు. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో దీపికా ప‌దుకొనే, జాన్వీక‌పూర్, మృణాల్ ఠాకూర్‌, ర‌ష్మ క మంద‌న్న హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. వ‌చ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇప్ప‌టికే 50 శాతానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
కాగా రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మార్చి 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఈ మూవీలో శ్రీలీల మ‌రో క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

Advertisement
Advertisement