త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kollywood | సినిమా చేస్తాన‌ని మోసం – ఖుష్బూ భ‌ర్త‌పై పోలీసు కేసు

సినిమా చేస్తాన‌ని మాటిచ్చి మోసం చేశారంటూ ఖ‌ష్బూ భ‌ర్త, త‌మిళ ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సీపై ఓ నిర్మాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్ తిరిగి ఇవ్వ‌మ‌ని అడిగితే బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ నిర్మాణ మ‌ణికంద‌న్ రామ‌న్ ఆరోపించారు.

N

Entertainment | Published On Apr 9, 2026, 5.50 pm IST

Kollywood | సినిమా చేస్తాన‌ని మోసం – ఖుష్బూ భ‌ర్త‌పై పోలీసు కేసు
Advertisement

Kollywood |  త‌మిళ ద‌ర్శ‌కుడు, సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ భ‌ర్త సుంద‌ర్ సీ వివాదంలో చిక్కుకున్నారు. సినిమా చేస్తాన‌ని చెప్పి సుంద‌ర్ సీ త‌న‌ను మోసం చేశారంటూ ఓ త‌మిళ నిర్మాత పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. క‌ల‌క‌ల‌ప్పు ఫ్రాంచైజ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు సినిమాలు వ‌చ్చాయి. సుంద‌ర్ సీ ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ క‌థాంశాల‌తో రూపొందిన క‌ల‌క‌ల‌ప్పు, క‌ల‌క‌ల‌ప్పు 2 సినిమాలు పెద్ద విజ‌యాన్ని సాధించారు. క‌ల‌క‌ల‌ప్పు సినిమాలో మూడో భాగం రానున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌ల‌క‌ల‌ప్పు 3 పేరుతో సుంద‌ర్ సీ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మాత మ‌ణికంద‌న్ రామ‌న్ ఈ సినిమాను నిర్మించాల‌ని అనుకున్నార‌ట‌. ఇందుకోసం డైరెక్ట‌ర్ సుంద‌ర్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చార‌ట‌.

బెదిరింపులు....

అడ్వాన్స్ తీసుకొని చాలా రోజులు అయినా క‌ల‌క‌ల‌ప్పు 3 సినిమాను సుంద‌ర్ సీ ప్రారంభించ‌లేద‌ని నిర్మాత ఆరోపిస్తున్నారు. అడ్వాన్ తిరిగి ఇవ్వ‌మ‌ని అడిగితే బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ చెన్నై పోలీస్ క‌మీష‌న‌రేట్‌లో నిర్మాత కంప్లైంట్ ఇచ్చారు.

ఐదు కోట్లు రెమ్యూన‌రేష‌న్‌తో క‌ల‌క‌ల‌ప్పు 3 సినిమా చేయ‌డానికి సుంద‌ర్ సీ అంగీక‌రించార‌ని, అరాణ్మ‌ణై 3, మ‌ద‌గ‌జ‌రాజా విజ‌యాల‌తో రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన సుంద‌ర్ సీ ఇప్పుడు ప‌దికోట్లు డిమాండ్ చేస్తున్నార‌ని నిర్మాత ఆరోపించారు. అడ్వాన్స్ మాత్రం వెన‌క్కి ఇచ్చేది లేద‌ని త‌న‌అనుచ‌రుల‌తో క‌లిసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. షూటింగ్ మొదలుపెట్టకుండా, అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న దర్శకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాత మ‌ణికంద‌న్ పోలీసులను కోరారు.

న‌య‌న‌తార‌తో...

ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్‌గా త‌మిళంలో న‌య‌న‌తార‌తో ముక్కుత్తి అమ్మ‌ణ్ 2తో పాటు విశాల్‌తో పురుష‌న్ సినిమాలు చేస్తున్నారు సుంద‌ర్ సీ. ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్‌తో ఓ సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు సుంద‌ర్ సీ ప్ర‌క‌టించ‌డం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 

Advertisement
Advertisement