త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | వార‌ణాసి కోసం రంగంలోకి మందాకిని – హాలీవుడ్ స్టైల్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్‌

మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న వార‌ణాసి మూవీ నెక్స్ట్ షెడ్యూల్ బుధ‌వారం నుంచి మొద‌లుకాబోతుంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ షూటింగ్ కోసం అమెరికా నుంచి ప్రియాంక చోప్రా హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. లేటెస్ట్ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రాపై ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను రాజ‌మౌళి చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌.

N

Entertainment | Published On Jan 27, 2026, 4.57 pm IST

Priyanka Chopra | వార‌ణాసి కోసం రంగంలోకి మందాకిని – హాలీవుడ్ స్టైల్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్‌
Advertisement

Priyanka Chopra |మ‌హేష్‌బాబు హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌క రూపొందుతోన్న మూవీ వార‌ణాసి. దాదాపు 1500 కోట్ల‌తో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా వార‌ణాసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. అనౌన్స్‌మెంట్ నుంచే పాన్ ఇండియ‌న్ వైడ్‌గా వార‌ణాసిపై బ‌జ్ మొద‌లైంది. జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు సైతం వార‌ణాసి మేకింగ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమా సెట్స్‌ను సంద‌ర్శించాల‌ని ఉందంటూ వ్యాఖ్య‌లు చేయ‌డంలో వార‌ణాసి క్రేజ్ హాలీవుడ్‌కు చేరుకుంది.

షూటింగ్‌కు బ్రేక్‌...

తాజాగా వార‌ణాసి మూవీపై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేసింది. ఈ భారీ బ‌డ్జెట్ మూవీ షూటింగ్‌కు బ్రేకిచ్చిన ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లిపోయింది. న్యూ ఇయ‌ర్‌ను కుటుంబంతో క‌లిసి యూఎస్‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఈవెంట్‌లోనూ పాల్గొన్న‌ది. దాదాపు నెల రోజుల గ్యాప్ త‌ర్వాత తిరిగి వార‌ణాసి షూటింగ్‌లో అడుగుపెట్ట‌బోతుంది. వార‌ణాసి నెక్స్ట్ షెడ్యూల్ బుధ‌వారం మొద‌లుకాబోతుంద‌ట‌. ఈ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం అమెరికా నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించింది.

హాలీవుడ్ స్టైల్‌లో...

హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో మ‌హేష్‌బాబు, ప్రియాంక చోప్రాల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను రాజ‌మౌళి చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లోనే ప్రియాంక చోప్రాపై ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను షూట్ చేయ‌బోతున్నార‌ట మేక‌ర్స్‌. హాలీవుడ్ స్టైల్‌లో హై ఇంటెన్స్‌గా సాగే ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌కు హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ యాక్ష‌న్‌ కొరియోగ్ర‌ఫీ అందించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

30 కోట్ల రెమ్యూన‌రేష‌న్‌...

కాగా వార‌ణాసి మూవీతోనే ప్రియాంక చోప్రా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల‌కుపైనే రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వార‌ణాసితోనే ఓ సినిమా కోసం హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ ఇండియ‌న్ హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్లు స‌మాచారం.
వార‌ణాసి మూవీలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement