త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | టీచ‌ర్ల బ‌దిలీలు అత్యంత క‌ఠినం.. వారికి ఆ తెలివితేట‌లు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తున్న టీచ‌ర్ల బ‌దిలీలు అత్యంత క‌ఠినం అని, వారికి తెలివితేట‌లు ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్ర‌భుత్వానికి టీచ‌ర్లు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jul 15, 2026, 6.53 pm IST

CM Revanth Reddy | టీచ‌ర్ల బ‌దిలీలు అత్యంత క‌ఠినం.. వారికి ఆ తెలివితేట‌లు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తున్న టీచ‌ర్ల బ‌దిలీలు అత్యంత క‌ఠినం అని, వారికి తెలివితేట‌లు ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్ర‌భుత్వానికి టీచ‌ర్లు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. కొత్త‌కోట ప్ర‌భుత్వ బాలికల ఉన్న‌త పాఠ‌శాల భ‌వ‌నం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

రాష్ట్రంలోని 26 వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 18 ల‌క్ష‌ల మంది చ‌దువుకుంటున్నారు. 11 వేల ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో 33 ల‌క్ష‌ల మంది విద్యార్థులు విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు ఉన్న అనుభ‌వం, డిగ్రీల్లో కూడా స‌గం కూడా ప్ర‌యివేటు టీచ‌ర్ల‌కు లేవు. మ‌రి ఎందుకు పేద‌లు ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల బాట ప‌డుతున్నారు. ఎందుకు ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో విద్యార్థులు చేర‌డం లేదు.. అంటే గ‌త ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హించడం, మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డం కార‌ణంగానే. కార్పొరేట్ స్కూళ్ల‌తో పోటీ ప‌డే విధంగా ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

క‌లెక్ట‌ర్‌ను బ‌దిలీ చేయ‌డం అత్యంత సులువు

గ‌త 20, 30 ఏండ్ల నుంచి పేరుకుపోయిన స‌మ‌స్య‌లు ఒక‌ట్రెండు సంవ‌త్స‌రాల్లోనే ప‌రిష్కారం కావు. అయితే ఆ దిశ‌గా ప‌రిష్కారం చేయ‌క‌పోతే వందేండ్లు అయినా ప‌రిష్కారం కావు. రాష్ట్రంలో టీచ‌ర్ల‌కు సంబంధించి 16 ఏండ్లు ప్రమోష‌న్లు, 10 ఏండ్లు బ‌దిలీలు జ‌ర‌గ‌లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో 22 వేల మంది టీచ‌ర్ల‌కు ప్రమోష‌న్లు క‌ల్పించాం. 35 వేల మందిని బ‌దిలీ చేసి 317 జీవోలో చెదిర‌పోయిన కుటుంబాల‌ను ఒక ద‌గ్గ‌రికి చేర్చి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాను. అప్పుడు టీచ‌ర్లు బోధ‌న‌పై మ‌న‌సు ల‌గ్నం చేసి చ‌దువు చెబుతార‌ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాను. ఇక క‌లెక్ట‌ర్‌ను బ‌దిలీ చేయ‌డం అత్యంత సులువు. కానీ టీచ‌ర్ల‌ను బ‌దిలీ చేయ‌డం అత్యంత క‌ఠినం. టీచ‌ర్లు చైత‌న్యం క‌లిగి ఉండి ర‌క‌ర‌కాల లీగ‌ల్ లిటిగేష‌న్లు సృష్టించ‌గ‌లిగిన తెలివితేట‌లు వారికి ఉన్నాయి. టీచ‌ర్ల సంఘాలు బ‌లంగా ఉన్నాయి. కానీ ప్ర‌మోష‌న్లు, బ‌దిలీల విష‌యంలో టీచ‌ర్లు సంపూర్ణంగా అండ‌గా నిల‌బ‌డ్డారని సీఎం గుర్తు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement