త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mouni Roy | ఆపండి..! పాప‌రాజీల‌పై నాగిని బ్యూటీ మౌనీరాయ్ ఆగ్ర‌హం..!

Mouni Roy | బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ పాప‌రాజీల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. టీవీ హోస్ట్, నటి అనూషా దండేక‌ర్‌తో క‌లిసి వ‌చ్చిన స‌మ‌యంలో పాప‌రాజీల తీరుతో విసిగిపోయి తీవ్ర‌స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్ వైర‌ల్‌గా మారాయి.

P

Entertainment | Published On Jul 15, 2026, 4.31 pm IST

Mouni Roy | ఆపండి..! పాప‌రాజీల‌పై నాగిని బ్యూటీ మౌనీరాయ్ ఆగ్ర‌హం..!
Advertisement

Mouni Roy | బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ పాప‌రాజీల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. టీవీ హోస్ట్, నటి అనూషా దండేక‌ర్‌తో క‌లిసి వ‌చ్చిన స‌మ‌యంలో పాప‌రాజీల తీరుతో విసిగిపోయి తీవ్ర‌స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్ వైర‌ల్‌గా మారాయి. వీడియో ప్ర‌కారం.. మౌనీ రాయ్ కారు ఎక్కుతున్న సమయంలో ఫొటోగ్రాఫర్లు వరుసగా ఫొటోలు, వీడియోలు తీస్తూనే కనిపించారు. ఇప్పటికే కారులో కూర్చున్నప్పటికీ కెమెరాలు ఆపకపోవడంతో అస‌హ‌నానికి గురైంది. ప‌లుసార్లు ఫొటోలు తీయొద్దని కోరినా పట్టించుకోకపోవడంతో చివరకు గట్టిగా స్టాప్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. ఇటీవలే తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు మౌనీ రాయ్ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌జ్ఞం తెలిసిందే. మే 14న ఇద్దరూ సంయుక్త ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ దశను ప్రశాంతంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్నామని, ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని వెల్ల‌డించారు. మౌనీ రాయ్‌, సూర‌జ్ నంబియార్ 2022 జ‌న‌వ‌రి 27న పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రి పెళ్లి మ‌ల‌యాళీ, బెంగాలీ సంప్ర‌దాయ‌ల ప్ర‌కారం జ‌రిగింది. కొంత‌కాలం ప్రేమ‌లో ఉన్న ఇద్ద‌రు పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. ఇటీవ‌ల వీరిద్ద‌రి పెళ్లిబంధం ముగిసిపోయింది. మౌనీ రాయ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవల సంజయ్ కపూర్, షహీర్ షేక్, నిమ్రత్ కౌర్ అహ్లువాలియా, అవినాష్ మిశ్రాతో కలిసి 'అబ్ హోగా హిసాబ్‌' వెబ్ షోలో మౌనీ నటించింది. మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తున్న 'ది వైవ్స్‌' మూవీలోనూ కీల‌క‌పాత్ర పోషిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర మూవీలోనూ క‌నిపించ‌నున్న‌ది. స్పెష‌ల్ సాంగ్‌తో పాటు ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు టాక్‌.

Advertisement
Advertisement