Malayalam OTT | ఓటీటీలోకి వారణాసి విలన్ మలయాళం మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటేస్ట్ మలయాళం మూవీ ఐ నోబడీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మలయాళం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆగస్ట్ 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Aug 16, 2026, 6.51 pm IST
Malayalam OTT | మహేష్‌బాబు(Mahesh babu), రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసిలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)విలన్‌గా నటిస్తున్నాడు. ఈ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ సినిమాలో కుంభా అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఐ నోబడీ అనే మలయాళ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ నిర్మించింది. నిషమ్ బషీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటించింది.
డిజాస్టర్...
జూన్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఐ నోబడీ మూవీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆగస్ట్ 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.
క్లైమాక్స్ ట్విస్ట్...
సోషల్ మీడియా ప్రభావం నేటి సమాజంపై ఎలా ఉందనే మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా ఇచ్చారు డైరెక్టర్. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు తడబడిపోయాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి యాక్టింగ్‌తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకున్నాయి.
దొంగతనం ఆరోపణలు...
రాజీవ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. భార్య మీరా, ఇద్దరు కూతుళ్లతో అతడి జీవితం సంతోషంగా సాగిపోతుంటుంది. ఓ బ్యాంకులోని పదిహేడు కోట్ల డబ్బును దోచుకున్న దొంగలు రాజీవ్‌ను బందీగా తీసుకెళతారు. దారిలో దొంగలు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అవుతుంది. అందరూ చనిపోతారు. రాజీవ్ మాత్రం క్షేమంగా బయటపడతాడు. దొంగలు కొట్టేసిన డబ్బు మిస్సవుతుంది. ఆ దొంగతనం రాజీవ్ చేశాడని ఆరోపణలు వస్తాయి. చివరకు భార్య, పిల్లలు కూడా అతడిని అనుమానిస్తారు. ఆ దొంగతనం నేరం నుంచి రాజీవ్ ఎలా బయటపడ్డాడు? ఆ డబ్బు ఎలా మిస్సయ్యింది అన్నదే ఈ మూవీ కథ.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ – సాయం చేసిన అభిమాని
ఆగస్టు 15, 2026

Reliance Jio | జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..
ఆగస్టు 10, 2026

Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ – రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ – రామాయణంతో లింక్
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | పరకాలలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.. శంకుస్థాపన చేసిన సీఎం
- ●Dead Lizard in Birthday Cake | బర్త్‌డే కేక్‌లో చనిపోయిన బల్లి.. తిన్న వెంటనే ఆసుపత్రికి 11 మంది.. ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్ యాక్షన్
- ●Trisha | త్రిషకు విజయ్ ప్రభుత్వం వీఐపీ ట్రీట్మెంట్ - నెటిజన్ల ట్రోలింగ్
- ●Asish Banerjee Death | తప్పుడు ఆరోపణలతోనే బలితీసుకున్నారు: ఆశిష్ బెనర్జీ మృతిపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
- ●Amit Shah vs Sonia Gandhi | వందేమాతరం పట్ల ఇంత అవమానమా.. సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: అమిత్ షా
- ●TIMS Sanath Nagar | 1,082 పడకలు.. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా టిమ్స్ సనత్‌నగర్

Revanth Reddy | పరకాలలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.. శంకుస్థాపన చేసిన సీఎం

Dead Lizard in Birthday Cake | బర్త్‌డే కేక్‌లో చనిపోయిన బల్లి.. తిన్న వెంటనే ఆసుపత్రికి 11 మంది.. ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్ యాక్షన్

Trisha | త్రిషకు విజయ్ ప్రభుత్వం వీఐపీ ట్రీట్మెంట్ - నెటిజన్ల ట్రోలింగ్

Asish Banerjee Death | తప్పుడు ఆరోపణలతోనే బలితీసుకున్నారు: ఆశిష్ బెనర్జీ మృతిపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు



