త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dead Lizard in Birthday Cake | బర్త్‌డే కేక్‌లో చనిపోయిన బల్లి.. తిన్న వెంటనే ఆసుపత్రికి 11 మంది.. ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్ యాక్షన్

మహారాష్ట్రలో బర్త్‌డే వేడుకల్లో ఘోరం. కేక్‌లో చనిపోయిన బల్లి రావడంతో చిన్నారులు సహా 11 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఎఫ్‌డీఏ దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి!

J

Crime | Published On Aug 16, 2026, 6.20 pm IST

Dead Lizard in Birthday Cake | బర్త్‌డే కేక్‌లో చనిపోయిన బల్లి.. తిన్న వెంటనే ఆసుపత్రికి 11 మంది.. ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్ యాక్షన్
Advertisement
  • మహారాష్ట్రలోని నాలాసోపారాలో బర్త్‌డే కేక్ తిని ఎడుగురు చిన్నారులు సహా 11 మందికి అస్వస్థత
  • కేక్‌లో చనిపోయిన బల్లిని గుర్తించిన బాధితులు, ముగ్గురు పిల్లలు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు
  • బేకరీ లైసెన్స్‌ను ఎఫ్‌డీఏ అధికారులు రద్దు చేయగా, శాంపిల్స్ సీజ్ చేసిన తులంజ్ పోలీసులు
  • మరోవైపు కల్యాణ్‌లోని బ్లింకిట్ ఫ్రీజర్‌లో ఎలుక తిరుగుతున్న వీడియో వైరల్ కావడంతో ఆందోళన

Dead Lizard in Birthday Cake | త్రినేత్ర.న్యూస్ : బర్త్‌డే అనగానే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది కేక్ కటింగ్ కోసమే. కానీ, అదే కేక్ కారణంగా ప్రాణాల మీదకు వస్తే? మహారాష్ట్ర (Maharashtra) లోని నాలాసోపారాలో ఇలాంటి ఘోరమే జరిగింది. చనిపోయిన బల్లి ఉన్న కేక్ తిని చిన్నారులు సహా 11 మంది ఆసుపత్రి పాలయ్యారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఫుడ్ సేఫ్టీపై తీవ్ర ఆందోళన రేపుతోంది.

అసలేం జరిగింది?

పాల్ఘర్ (Palghar) జిల్లా నాలాసోపారా తూర్పులోని తకిపాడ ప్రాంతంలోని నీలకంఠేశ్వర్ బిల్డింగులో శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ 25 ఏళ్ల యువతి బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు ఇరుగుపొరుగున ఉండే పిల్లలు, మహిళలు హాజరయ్యారు. బర్త్‌డే కేక్ కట్ చేసిన తర్వాత అతిథులకు సర్వ్ చేశారు. అది తిన్న కొద్దిసేపటికే ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలకు గుండెల్లో మంట, వాంతులు, కడుపునొప్పి మొదలైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని సమీపంలోని మున్సిపల్, విజయలక్ష్మి ఆసుపత్రికి తరలించారు.

బల్లిని గుర్తించిన పిల్లలు

తాము తిన్న కేక్‌లో చనిపోయిన బల్లి ఉన్నట్లు చిన్నారులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ విద్యా సావంత్ (Dr Vidya Sawant) వెల్లడించారు. అయితే, ఏడుగురు చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూ (ICU) లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

బేకరీ లైసెన్స్ రద్దు

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న తులంజ్ పోలీసులు (Tulinj Police) ఆసుపత్రికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తకిపాడలోని చాముండ కేక్ షాప్ (Chamunda Cake Shop) నుంచి ఆ కేక్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించి, శాంపిల్స్ సీజ్ చేసి టెస్టింగ్ కోసం పంపారు. అలాగే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు సదరు బేకరీపై దాడులు నిర్వహించి లైసెన్స్‌ను రద్దు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని వసాయి-విరార్ ప్రాంత మేయర్ అజీవ్ పాటిల్ పేర్కొన్నారు.

బ్లింకిట్ ఫ్రీజర్‌లో ఎలుక

ఈ ఘటన మరువక ముందే ఆన్‌లైన్ డెలివరీ యాప్ బ్లింకిట్ (Blinkit) స్టోర్‌కు సంబంధించిన మరో వీడియో వైరల్ (viral) అవుతోంది. థానేలోని కల్యాణ్ గోద్రేజ్ హిల్ ప్రాంతంలో ఉన్న బ్లింకిట్ స్టోర్ ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో ఓ ఎలుక తిరుగుతున్న వీడియో వినియోగదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే మలాడ్ వెస్ట్‌లోని మరో బ్లింకిట్ సెంటర్‌లో ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు చేసి నిబంధనల ఉల్లంఘన కింద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌ను రద్దు చేశారు. బేకరీ ఉత్పత్తులు, క్విక్-కామర్స్ స్టోర్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement