Traffic Diversion | సైబర్ గేట్ వద్ద కుంగిన రోడ్డు.. కీలక సూచనలు చేసిన ట్రాఫిక్ పోలీసులు
Traffic Diversion | మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు ఇటీవల కుంగిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ నుంచి మురుగునీరు లీక్ కావడంతో రోడ్డు కుంగినట్లుగా భావిస్తున్నారు. రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు.
Traffic Diversion | మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు ఇటీవల కుంగిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ నుంచి మురుగునీరు లీక్ కావడంతో రోడ్డు కుంగినట్లుగా భావిస్తున్నారు. రోడ్డుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. అయితే, ఐకియా నుంచి సైబర్ టవర్స్, జేఎన్టీయూ వైపు వెళ్లే వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. రానున్న ఐదు రోజుల పాటు ఐకియా నుంచి సైబర్ టవర్స్, జేఎన్టీయూ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు, డైవర్షన్స్‌ను అనుసరించాలని పోలీసులు సూచించారు. డైవర్షన్‌లో భాగంగా ఐకియా నుంచి వచ్చే వాహనాలను లెమన్ ట్రీ హోటల్, రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఎడమ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు. మహీంద్రా–సీఐఐ జంక్షన్ మార్గంగా సైబర్ టవర్స్ వైపు మళ్లించనున్నారు. అక్కడి నుంచి సాధారణ మార్గంలో జేఎన్‌టీయూ వైపు వెళ్లవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహనదారులు సహకరించాలని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





