త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | అప్పుడు చెల్లెలు – ఇప్పుడు హీరోయిన్ – వెంకీమామ‌తో బుట్ట‌బొమ్మ రొమాన్స్‌

వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన నాలుగు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఐదో మూవీ సెట్ట‌య్యింది. మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jan 31, 2026, 4.05 pm IST

Pooja Hegde | అప్పుడు చెల్లెలు – ఇప్పుడు హీరోయిన్  – వెంకీమామ‌తో బుట్ట‌బొమ్మ రొమాన్స్‌
Advertisement

Pooja Hegde |  చిరంజీవి ఆచార్య త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో ఐరెన్ లెగ్‌గా ముద్ర‌ప‌డ‌టంతో పూజా హెగ్డే నాలుగేళ్ల పాటు తెలుగులో ఒక్క అవ‌కాశం కూడా రాలేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌తో చేస్తున్న సినిమా రిలీజ్ కాక‌ముందే తెలుగులో మ‌రో బంప‌రాఫ‌ర్ అందుకుంది.

మల్టీస్టార‌ర్‌...

టాలీవుడ్‌లో మెస్ట్ స‌క్సెస్‌ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సినిమాలు వ‌చ్చాయి. ఇవ‌న్నీ బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. తాజాగా వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి క‌ల‌యిక మ‌రోసారి కుదిరిన‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత త‌న నెక్స్ట్ మూవీని వెంక‌టేష్‌తో చేయ‌బోతున్నార‌ట అనిల్ రావిపూడి. మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో త‌మిళ క‌థానాయ‌కుడు కార్తి, మ‌ల‌యాళ హీరో ఫ‌హాద్ ఫాజిల్‌ల‌లో ఒక‌రు కీల‌క పాత్ర‌లో నటించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

పూజా హెగ్డే...

ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫిక్సైన‌ట్లు స‌మాచారం. వెంక‌టేష్‌కు జోడీగా క‌నిపించ‌నుంద‌ట‌. ఇటీవ‌ల వెంక‌టేష్‌ను క‌లిసిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పూజా హెగ్డే పోస్ట్ చేసింది. ఈ సినిమా ఆడిష‌న్‌లో భాగంగానే బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే...వెంక‌టేష్‌ను క‌లిసిన‌ట్లు చెబుతున్నారు.వెంక‌టేష్‌తో పూజా హెగ్డే సినిమా చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో వెంక‌టేష్, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ఎఫ్ 3 మూవీలో పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్ చేసింది. అలాగే స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌లో వెంక‌టేష్ చెల్లెలిగా పూజా హెగ్డే క‌నిపించింది.
బాలీవుడ్ సినిమాలో వెంక‌టేష్‌ చెల్లెలి పాత్ర చేసిన పూజా హెగ్డే...అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్‌గా న‌టించ‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారుతోంది. 2027 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ సినిమాతో పాటు త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్‌, లారెన్స్ కాంచ‌న 4 సినిమాలు చేస్తోంది. హిందీలో వ‌రుణ్ ధావ‌న్‌తో ఓ సినిమా చేస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement