PM Modi | భారతీరాజా మృతి సినీ రంగానికి తీరని లోటు : ప్రధాని మోదీ
PM Modi | తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా (Bharathiraja) మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
PM Modi | తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా (Bharathiraja) మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినీ రంగానికి భారతీరాజా చేసిన సేవలను మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం సినీపరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు.
భారతీరాజా మరణం తీవ్ర బాధను కలిగించిందన్నారు. చలనచిత్ర ప్రపంచంలో మహోన్నత వ్యక్తి అని, ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ కఠిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోదీ తన పోస్టులో రాసుకొచ్చారు.
The passing of Thiru Bharathiraja Ji is very saddening. He was a towering figure of the cinema world whose works transformed Tamil cinema. Particularly noteworthy was his portrayal of rural life. My thoughts are with his family and admirers in this hour of grief. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 11, 2026
85 ఏండ్ల భారతీ రాజా గత కొంతకాలంగా శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని దవాఖానాలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 1941 జూలై 17న జన్మించారు. ఆయన తెరకెక్కించిన పదహారేళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా పలు చిత్రాల్లో ఆకట్టుకున్నారు.
Also Read..
ఎల్ నినో ప్రభావం.. రుతుపవనాలకు అంతరాయం
ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ
హర్మూజ్‌ను పూర్తిగా మూసేసిన ఇరాన్.. ఇంధన ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..?
తాజావార్తలు
- ●El Nino | ఎల్ నినో ప్రభావం.. రుతుపవనాలకు అంతరాయం
- ●NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ
- ●Chrome | క్రోమ్‌లో జెమినీకి భారీ అప్డేట్.. ఫోటోలను ఎడిట్ చేయడం ఇక సులభం..
- ●Strait of Hormuz | హర్మూజ్‌ను పూర్తిగా మూసేసిన ఇరాన్.. ఇంధన ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..?
- ●Vizag Steel Plant | వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం.. వీడియో
- ●Gold And Silver Prices Today | కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు.. బంగారం ధర మళ్లీ భారీగా పతనం..

El Nino | ఎల్ నినో ప్రభావం.. రుతుపవనాలకు అంతరాయం

NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ

Chrome | క్రోమ్‌లో జెమినీకి భారీ అప్డేట్.. ఫోటోలను ఎడిట్ చేయడం ఇక సులభం..

Strait of Hormuz | హర్మూజ్‌ను పూర్తిగా మూసేసిన ఇరాన్.. ఇంధన ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..?





