త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vizag Steel Plant | వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో మ‌రో ప్ర‌మాదం.. తప్పిన ప్రాణ న‌ష్టం.. వీడియో

G

National | Published On Jun 11, 2026, 11.12 am IST

Vizag Steel Plant | వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో మ‌రో ప్ర‌మాదం.. తప్పిన ప్రాణ న‌ష్టం.. వీడియో
Advertisement

Vizag Steel Plant | త్రినేత్ర‌.న్యూస్‌: విశాఖప‌ట్నంలోని (Visakhapatnam) వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో (Vizag Steel Plant) మ‌రో ప్ర‌మాదం చోటుచేసుకుంది. గురువారం ఉద‌యం ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-1 (స్టీల్ మెల్టింగ్ షాప్-1) విభాగంలో ఉన్న ల్యాడిల్‌ నుంచి ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్‌లో ద్రవ ఉక్కు (Molten Steel) నేలపాలైంది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న ఉద‌యం 5.30 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం.

అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే ద్రవ ఉక్కు ఒక్కసారిగా ల్యాడిల్‌ నుంచి బయటకు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అనంతరం ప్లాంట్‌ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, బుధ‌వారం కూడా ఎస్ఎంఎస్‌-2లో ల్యాడిల్ నుంచి ఉక్కు ద్ర‌వం నేల‌పాలైంది. అయితే రెండు ఘ‌ట‌న‌ల్లో ప్రాణ‌న‌ష్టం లేక‌పోవ‌డంతో ప్లాంట్ యాజ‌మాన్యం ఊపిరిపీల్చుకుంది.

కాగా, ఈ నెల 8న (సోమవారం) స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్‌ఎంఎస్‌-2 నుంచి ఉక్కు ద్రవం మీద పడి 9 మంది కార్మికులు మరణించిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో మరికొందరు గాయ‌ప‌డ్డారు. ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేంద్రం నియ‌మించిన త్రీమెన్ క‌మిటీ విచార‌ణ జ‌రుపుతుండ‌గానే వ‌రుస‌ ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

Advertisement

తాజావార్తలు

Advertisement