త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Kerala Story 2 | చిక్కుల్లో ది కేర‌ళ స్టోరీ 2 మూవీ.. సెన్సార్ స‌ర్టిఫికెట్‌ని ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్‌..!

The Kerala Story 2 | "ది కేరళ స్టోరీ 2" మూవీకి ఇచ్చిన సెన్సార్ స‌ర్టిఫికెట్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. క‌న్నూర్‌లోని చిత్ర‌ప‌రంభ నివాసి శ్రీ‌దేవ్ నంబూద్రి ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది.

P

Entertainment | Published On Feb 20, 2026, 8.15 am IST

The Kerala Story 2 | చిక్కుల్లో ది కేర‌ళ స్టోరీ 2 మూవీ.. సెన్సార్ స‌ర్టిఫికెట్‌ని ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్‌..!
Advertisement

The Kerala Story 2 | "ది కేరళ స్టోరీ 2" మూవీకి ఇచ్చిన సెన్సార్ స‌ర్టిఫికెట్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. క‌న్నూర్‌లోని చిత్ర‌ప‌రంభ నివాసి శ్రీ‌దేవ్ నంబూద్రి ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. నిర్మాత స‌న్‌షైన్ పిక్చ‌ర్స్‌ను సైతం స్పంద‌న చెప్పాల‌ని ఆదేశించింది. ఈ నెల 24న హైకోర్టు మ‌రోసారి విచార‌ణ జ‌రుప‌నున్న‌ది.

'ది కేరళ స్టోరీ 2 - గోస్ బియాండ్' ట్రైలర్ విడుదలైంది. లవ్ జిహాద్ అంశం ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. మూవీపై చాలా మంది అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో దుమారం రేగుతున్న‌ది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం మూవీని తిర‌స్క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. 'ది కేరళ స్టోరీ' సీక్వెల్‌ను విద్వేష‌పూరిత చిత్రంగా అభివ‌ర్ణించారు.

"ది కేరళ స్టోరీ 2"ను వ్యతిరేకించినది కేరళ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. మహారాష్ట్ర సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అబు అజ్మీ, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సైతం ఖండించారు. అయితే, బీజేపీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఈ సినిమాను భావ ప్రకటనా స్వేచ్ఛకు లింక్ చేస్తూ సమర్థించారు. తాజాగా ఈ అంశం కోర్టు వ‌ర‌కు చేరింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని పిటిష‌న‌ర్ కోరారు.

ది కేరళ స్టోరీ 2 స్టోరీ విష‌యానికి వ‌స్తే.. ముగ్గురు హిందూ అమ్మాయిల‌ను ముస్లిం యువ‌కులు పెళ్లి చేసుకోవ‌డం.. ఆ త‌ర్వాత బ‌ల‌వంతంగా ఇస్లాంలోకి మారుస్తున్న‌ట్లుగా ట్రైల‌ర్‌లో చూపించారు. ముఖ్యంగా ల‌వ్ జిహాద్ అంశాన్ని లేవ‌నెత్తారు. ఈ సినిమాలో అదితి భాటియా, ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు జారీ చేసిన స‌ర్టిఫికెట్‌ని ర‌ద్దు చేస్తుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement