త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parvathy Thiruvothu | మల్లు బ్యూటీ పార్వతి తిరువోతు శరారీకృతిపై కామెంట్స్‌..!

Parvathy Thiruvothu | మలయాళీ నటి పార్వతి తిరువోతు ఇటీవల వెరైటీ మ్యాగజైన్‌ ఇండియన్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. పలువురు నెటిజన్లు పార్వతి డ్రెస్‌తో పాటు శరీరాకృతిపై కామెంట్స్‌ చేశారు. ఆ ఈవెంట్లో పార్వతి పూర్తిగా బ్లాక్‌ గ్లామ్‌ లుక్‌లో కనిపించింది. ఇదే కార్యక్రమంలో మృణాల్‌ ఠాకూర్‌, నిమ్రత్‌ కౌర్‌, మాళవిక మోహనన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్ సహా పలువురు పాల్గొన్నారు.

P

Entertainment | Published On Feb 6, 2026, 12.37 pm IST

Parvathy Thiruvothu | మల్లు బ్యూటీ పార్వతి తిరువోతు శరారీకృతిపై కామెంట్స్‌..!
Advertisement

Parvathy Thiruvothu | మలయాళీ నటి పార్వతి తిరువోతు ఇటీవల వెరైటీ మ్యాగజైన్‌ ఇండియన్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. పలువురు నెటిజన్లు పార్వతి డ్రెస్‌తో పాటు శరీరాకృతిపై కామెంట్స్‌ చేశారు. ఆ ఈవెంట్లో పార్వతి పూర్తిగా బ్లాక్‌ గ్లామ్‌ లుక్‌లో కనిపించింది. ఇదే కార్యక్రమంలో మృణాల్‌ ఠాకూర్‌, నిమ్రత్‌ కౌర్‌, మాళవిక మోహనన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్ సహా పలువురు పాల్గొన్నారు.

ఈవెంట్‌లో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది. స్ట్రాప్‌లెస్ కార్సెట్ టాప్‌లో.. భారీ ప్రిన్సెస్ నెక్లెస్, స్టడ్ ఈయర్‌ రింగ్స్‌, బ్రాస్‌లెట్‌తో దర్శనమిచ్చింది. అయితే, పార్వతి లుక్‌ చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమె బరువు భారీగా ఉందని.. దాంతో ఆమెకు డ్రెస్‌ ఫిట్‌ కాలేదన్నారు. ఓ నెటిజన్‌ రెజ్లర్‌లా ఉందని కామెంట్‌ చేయగా.. మరొకరు అమ్మమ్మలా ఉందని మరొకరు కామెంట్‌ పెట్టారు. డ్రెస్‌ ఆమెకు రూట్‌ కాలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, పలువురు పార్వతికి మద్దతు పలికారు. ఆమె కొత్త స్టయిల్‌ను ప్రయత్నించిదని.. ఈవెంట్‌లో పూర్తిగా ఆత్మవిశ్వాసంతో కనిపించిందని చెప్పుకొచ్చారు.

గత కొంతకాలంగా పార్వతి సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతున్నది. సోషల్‌ మీడియాలో ఎంత ట్రోలింగ్‌ సారిగా వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నది. తాజాగా మరోసారి సైతం ట్రోలింగ్‌ను ఏమాత్రం పట్టించుకోనంటూ చెప్పినట్లయ్యింది. గతంలో పార్వతిపై ట్రోలింగ్‌ జరిగింది. తొలిసారిగా ఎదుర్కొనే వారిపై అవి తీవ్ర ప్రభావ చూపుతాయని.. సపోర్ట్‌ ఎంత అవసరమో తన అనుభవంతో తెలుసుకున్నానని.. అందుకే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి.. ముఖ్యంగా మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటానని గతంలో స్పందించింది.

వాస్తవానికి పార్వతి తన సినిమాలతో కాంటే కామెంట్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన చిన్నతనంలో జరిగిన దారుణ ఘటనను బయట పెట్టింది. చిన్న వయసులో రైల్వేస్టేషన్లలో ఉన్న సమయంలో ఓ ఆగంతకుడు వచ్చి తన ఛాతీపై బలంగా కొట్టి వెళ్లిపోయాడని వాపోయింది. ఆ ఘటన తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని, అప్పటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో మగాళ్ల చూపుల నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలో తల్లి నేర్పించిందని చెప్పింది. పెద్దయ్యాక సైతం వేధింపులు నీడలా వెంటాడాయని ఆవేదన వ్యక్తం చేసింది. స్కూల్‌ డేస్‌లో తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చాలని వేధించాడని వాపోయింది. ఇదిలా ఉండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమాపై విమర్శలు గుప్పించింది. ఇండస్ట్రీలో నిజాలు మాట్లాడితే ‘మతిస్థిమితం లేదు’ అని ముద్ర వేస్తారని వ్యాఖ్యానించింది.

పార్వతి తిరువోతు సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా మలయాళ మూవీ హర్‌లో కనిపించింది. ప్రస్తుతం ప్రధమ దృష్టియ కుట్టక్కర్‌ మూవీలో నటిస్తున్నది. ఈ సినిమాలో పవరఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నది. అలాగే, పృధ్విరాజ్‌ సుకుమారన్‌ ఐ నోబ‌డి మూవీలోని నటిస్తున్నది.

Advertisement
Advertisement