త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

త‌మ ఓటీటీలో రిలీజ్ కానున్న అప్‌క‌మింగ్ మూవీస్‌, వెబ్‌సిరీస్ వివ‌రాల‌ను శుక్ర‌వారం ఓటీటీ విన్ రివీల్ చేసింది. ఐశ్వ‌ర్య రాజేష్, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న పాక‌శాల పంతంతో పాటు ప‌లు సినిమాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలు ఏవంటే?

N

Entertainment | Published On Feb 27, 2026, 4.52 pm IST

OTT | ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
Advertisement

OTT | ప్ర‌స్తుతం ఓటీటీల నుంచి థియేట‌ర్ల‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌ల‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ త‌న అప్‌క‌మింగ్ సినిమాలు, సిరీస్‌ల లిస్ట్‌ను రివీల్ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ లాంఛ్ చేసి మూడేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా త‌మ సంస్థ నుంచి కొత్త కంటెంట్ రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

పాక‌శాల పంతం...

ఐశ్వ‌ర్య‌రాజేష్, సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో పాక‌శాలం పంతం పేరుతో ఈటీవీ విన్ ఓటీటీ ఓ మూవీని తెర‌కెక్కిస్తోంది. సంప్ర‌దాయ‌ప‌ద్ద‌తుల్లోనే వంట చేయాల‌ని ప‌ట్టు ప‌ట్టే ఓ గ‌డ‌స‌రి అత్త‌, మోడ్ర‌న్ టెక్నాల‌జీకి అనుగుణంగా వంట ఈజీగా అయిపోవాల‌ని వాదించే ఓ సొగ‌స‌రి కోడ‌లు మ‌ధ్య ఈగో చుట్టూ ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. పాక‌శాల పంతం సినిమాకు క‌ర‌ణ్ తుమ్మ‌కొమ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో మ‌హ‌త్ రాఘ‌వేంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

పాపం ప్ర‌తాప్‌...

తిరువీర్, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించిన పాపం ప్ర‌తాప్ మూవీ ఏప్రిల్ 10న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. ఈటీవీ విన్ నిర్మించిన ఈ సినిమాకు ద‌ర్గా న‌రేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో పెళ్లి చేసుకున్న ఓ కొత్త జంట‌, ర‌చ్చ బండ ద‌గ్గ‌ర గుమిగూడిన జ‌నం క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

బేబీ ఫేమ్‌...

గుర్తుకొస్తున్నాయి పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందించ‌బోతున్న‌ట్లు ఈటీవీ విన్ వెల్ల‌డించింది. ఈ సిరీస్‌లో బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. వినోద్ గాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

జిల్లేడు చెట్టు...

జిల్లేడు చెట్టు పేరుతో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ మూవీ కూడా రాబోతుంది. కాలం మారొచ్చు… కాని సాంప్రదాయం మనిషి మూలాలను ఎప్పటికీ మార్చదు అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ఆధునిక‌త కార‌ణంగా మ‌నుషుల మ‌ధ్య దూరం ఎలా పెరిగింది అనే కాన్సెప్ట్‌తో జిల్లేడు చెట్టు మూవీ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.
బ్ల‌డీ పేరుతో రూపొందుతోన్న ఓ మూవీ షూటింగ్ స‌మ్మ‌ర్ నుంచి ప్రారంభం కాబోతున్న‌ట్లు ఈటీవీ విన్ పేర్కొన్న‌ది. ది అన్‌టోల్డ్ టేల్ ఆఫ్ గోదావ‌రి అంటూ పోస్ట‌ర్‌పై పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ మూవీలో క‌మిటీ కుర్రాళ్లు ఫేమ్ సందీప్ స‌రోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఇవే కాకుండా లిటిల్ థింగ్స్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement