Ntr Dragon Update | 2026 లో డ్రాగన్ రిలీజ్ లేనట్లేనా? – ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మూవీపై కొత్త రూమర్
ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూన్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ కానుందని అంటున్నారు. 2027 సమ్మర్‌లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Dec 27, 2025, 2.33 pm IST
ఎన్టీఆర్ డ్రాగన్
Ntr Dragon Update | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ మూవీ డ్రాగన్ రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. 2026లో ఈ సినిమా రిలీజ్ కావడం అనుమానమేనని అంటున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జెట్ స్పీడ్‌లో సాగుతోంది. ఎన్టీఆర్‌పై కొన్ని హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్రశాంత్ నీల్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పలువురు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పని చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే మొదలైన ఈ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జనవరి రెండో వారం వరకు జరుగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్లతో పాటు కొంత టాకీ పార్ట్‌ను కూడా షూట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.
ఆరేడు నెలలు గ్యాప్...
గత ఏడాది ఫిబ్రవరిలో డ్రాగన్ షూటింగ్ మొదలైంది.ఆ తర్వాత ఏప్రిల్‌లో కొద్ది రోజలు చిత్రీకరణ జరిపారు. వార్ 2తో ఎన్టీఆర్ బిజీగా ఉండటం, ఆ తర్వాత జరిగిన ఓ ప్రమాదం కారణంగా ఆరేడు నెలల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ఈ గ్యాప్ కారణంగా ఒకానొక దశలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా డ్రాగన్ ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ డిసెంబర్‌లో తిరిగి షూటింగ్‌ను మొదలుపెట్టారు. నాన్‌స్టాప్‌గా వచ్చే ఏడాది వేసవి వరకు డ్రాగన్‌కు ఎన్టీఆర్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని యూనిట్ మొత్తం ఫారిన్ వెళ్లనున్నారట. అఫ్రికాలో ఓ భారీ షెడ్యూల్ తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జూన్ 25 కాదు...
డ్రాగన్ సినిమాను జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. రిలీజ్ డేట్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించారు. షూటింగ్ డిలే కావడంతో అనుకున్న డేట్‌కు డ్రాగన్ థియేటర్లలోకి రావడం అసాధ్యంగా మారింది. పోస్ట్‌పోన్ కావడం దాదాపు కన్ఫామ్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ప్రశాంత్ నీల్ ఐదారు నెలలు సమయం తీసుకోవాలని అనుకుంటున్నారట. దాంతో 2026లో డ్రాగన్ రిలీజ్ కావడం అనుమానమేనని టాక్ వినిపిస్తుంది. 2027 వేసవిలో ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ సినిమాను రెండు పార్ట్‌లుగా రూపొందిస్తున్నారు. నాలుగైదు నెలల గ్యాప్ తీసుకొని సెకండ్ పార్ట్‌ను కూడా 2027 ఎండింగ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
డ్రాగన్‌లో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



