త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nithiin | సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో నితిన్ నెక్స్ట్ మూవీ – ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

హీరో నితిన్ నెక్స్ట్ మూవీకి ద‌ర్శ‌కుడితో పాటు జాన‌ర్ ఏద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చింది. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చేయ‌బోతున్నారు నితిన్‌. ఆదివారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

N

Entertainment | Published On Jan 25, 2026, 2.19 pm IST

Nithiin | సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్‌లో నితిన్ నెక్స్ట్ మూవీ – ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?
Advertisement

Nithiin | వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు నితిన్‌. 2020లో వ‌చ్చిన భీష్మ త‌ర్వాత నితిన్‌కు స‌రైన హిట్టు లేదు. గ‌త ఏడాది నితిన్ హీరోగా న‌టించిన రాబిన్‌హుడ్‌తో పాటు త‌మ్ముడు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో నెక్స్ట్ సినిమా విష‌యంలో నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చాలా క‌థ‌ల‌నే రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా హిట్టు కోసం జాన‌ర్ కూడా మార్చేశాడు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో నెక్స్ట్ మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ర‌థ స‌ప్త‌మి సంద‌ర్భంగా ఈ సినిమాను ఆదివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

36వ సినిమా ఇది...

నితిన్ హీరోగా న‌టిస్తున్న 36వ సినిమా ఇది. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఇందులో నితిన్ లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందులో నితిన్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నా బాడీ నో రూల్స్ అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో ఓ తీర ప్రాంతం క‌నిపిస్తోంది. వీఐ ఆనంద్ గ‌త సినిమాల త‌ర‌హాలోనే విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. తెలుగులో టైగ‌ర్‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, ఒక్క క్ష‌ణం, డిస్కో రాజా సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు వీఐ ఆనంద్‌.

2024లో....

చివ‌ర‌గా డైరెక్ట‌ర్‌గా 2024లో ఊరు పేరు భైవ‌ర‌కోన సినిమా చేశాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ నితిన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. వీఐ ఆనంద్‌తో పాటు నీర‌జ కోన ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ఓ సినిమా చేయ‌నున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement