Crime Thriller OTT | అఫీషియల్ – ఓటీటీలోకి శ్రీవిష్ణు క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ – రన్‌టైమ్ రెండు గంటలే
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Mar 29, 2026, 9.56 am IST
Crime Thriller OTT | శ్రీవిష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ మూవీ డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలిచింది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించాడు. మార్చి ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుంది.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యాయి. ఏప్రిల్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
రెబా మోనికా జాన్....
మృత్యుంజయ్ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించింది. వీర్ ఆర్యన్, సుదర్శన్, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించారు. కామెడీ కథలతో వరుసగా విజయాలను అందుకున్న శ్రీవిష్ణు తన పంథాకు భిన్నంగా చేసిన ప్రయత్నమిది. పాటలు, లవ్, కామెడీ ట్రాక్‌లు లేకుండా ప్యూర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఈ సినిమాను తెరకెక్కించారు.
బడ్జెట్ ఎంతంటే?
కాన్సెప్ట్‌తో పాటు శ్రీవిష్ణు యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చినా కమర్షియల్‌గా మాత్రం మృత్యుంజయ్ విజయాన్ని సాధించలేదు. దాదాపు 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై శాతం మాత్రమే రికవరీ సాధించింది.
జై అన్వేషణ...
జై (శ్రీవిష్ణు) ఓ న్యూస్ పేపర్‌లో యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. చనిపోయిన వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల నుంచి శ్రద్ధాంజలి యాడ్స్ తీసుకొస్తుంటాడు. అచ్యుత్ రావ్ అనే వ్యక్తి మరణించడంతో అతడి ఇంటికి వెళతాడు జై. తండ్రి గురించి అచ్యుత్‌రావ్ కూతురు పడుతోన్న బాధ జైని కదిలిస్తుంది. అచ్యుత్‌రావ్ చనిపోయిన కొద్ది రోజులకే అదే తరహాలో మరో వ్యక్తి చనిపోతాడు. మామూలు ప్రమాదాలుగానే ఈ రెండు కేసులను పోలీసులు భావిస్తారు. కానీ ప్రీప్లాన్‌డ్ మర్డర్స్ అని జై అనుమానిస్తాడు? అతడి అనుమానం నిజమైందా? అసలైన హంతకుడిని జై ఎలా కనిపెట్టాడు. ఈ హత్యలకు సాధుకు (వీర్ ఆర్యన్) ఉన్న సంబంధమేమిటి? జై ఇన్వేస్టిగేషన్‌లో అతడికి పోలీస్ ఆఫీసర్ సీతా పరశురామ్ (రెబా మోనికా జాన్) ఎలా అండగా నిలిచింది అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



