త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss | జెన్ జీ నిరసనతో ఫేమ‌స్‌ – ఏకంగా బిగ్‌బాస్‌లో ఛాన్స్ కొట్టేసిన రియా!

నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన నిర‌స‌న‌ల‌తో ఫేమ‌స్ అయ్యింది సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్‌ రియా అహిర్‌. తాజాగా ఈ బ్యూటీ బిగ్‌బాస్ హిందీ సీజ‌న్ 20లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్ట‌బోతుంది. సెప్టెంబ‌ర్ 6 నుంచి మొద‌లుకానున్న హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Aug 27, 2026, 7.05 pm IST

Bigg Boss | జెన్ జీ నిరసనతో ఫేమ‌స్‌ – ఏకంగా బిగ్‌బాస్‌లో ఛాన్స్ కొట్టేసిన రియా!
Advertisement

Bigg Boss | ముంబైలో పోలీస్ వ్యాన్ కు ధైర్యంగా  అడ్డంగా నిలబడి .. జెన్ జీ ఆందోళనలో పాపులర్ అయిన రియా మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడా ఆ అమ్మాయి ని అదృష్టం వెతుక్కుంటూ వస్తున్నది.

నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో దేశ‌వ్యాప్తంగా యువ‌త నిర‌స‌న‌లు తెలిపారు.ఈ పోరాటంలో వారికి చాలా మంది సెలిబ్రిటీలు మ‌ద్ద‌తు ఇచ్చారు. మ‌రికొంద‌రు నిర‌స‌న‌ల్లో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్నారు. నీట్ పేప‌ర్ లీక్ నిర‌స‌న‌ల‌తో సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్‌, యాక్ట‌ర్ రియా అహిర్ ఫేమ‌స్ అయ్యింది. ముంబాయిలో నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతుండ‌గా..వ్యాన్‌కు ఒంట‌రిగా ఎదురువెళ్లి అడ్డుకుంది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. రియా అహిర్ ధైర్య‌సాహ‌సాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక్క ఫొటోతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది రియా అహిర్‌. నీట్ నిర‌స‌న‌ల‌తో రియా అహిర్‌కు సోష‌ల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ...

తాజాగా ఈ బ్యూటీ ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు అడుగు దూరంలో నిలిచింది. బిగ్‌బాస్ హిందీ సీజ‌న్ 20 సెప్టెంబ‌ర్ 6 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ రియాలిటీ షోకు బాలీవుడ్ అగ్ర హీరో స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు ఫైన‌ల్ అయ్యింది. తెలుగులో అగ్నిప‌రీక్ష త‌ర‌హాలో హిందీలో బిగ్‌బాస్ లాంఛ్ కావ‌డానికి ముందు ఫ్యాన్స్ కా ఫైస్లా పేరుతో ఓ షోనుమేక‌ర్స్ లాంఛ్ చేశారు.

ప్రోమో రిలీజ్‌...

ఫ్యాన్స్ కా ఫైస్లా ప్రోమో గురువారం రిలీజైంది. ఈ ప్రోమోలో రియా అహిర్ క‌నిపించ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఆమెతో పాటు ల‌వ్ గిల్ ప్రోమోలో సంద‌డి చేసింది. ఈ ఇద్ద‌రిలో ఫ్యాన్స్ ఓటింగ్ ద్వారా ఒక‌రు బిగ్‌బాస్ సీజ‌న్ 20లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ప్రోమోలో చూపించారు. ఎవ‌రు విన్న‌ర్ అన్న‌ది సెప్టెంబ‌ర్ 6న స‌ల్మాన్ ఖాన్ రివీల్ చేస్తారు.

విమ‌ర్శ‌లు....

రియా అహిర్ ఫ్యాన్స్ కా ఫైస్లా ప్రోమోలో క‌నిపించ‌డంపై ప్ర‌శంస‌ల కంటే విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ కావ‌డానికే ఆమె నీట్ నిర‌స‌న‌ల‌ను అడ్డుపెట్టుకుంద‌ని చాలా మంది అంటున్నారు. నిర‌స‌న‌ల్లో పాల్గొన‌డం వ‌ల్లే ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంద‌ని ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

 

Advertisement
Advertisement