Crime News | భర్త సిగరెట్ తాగొస్తానని వెళ్లాడు.. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి భార్య!
Crime News | అది రాజేంద్రనగర్ ప్రాంతం. సమయం అర్ధరాత్రి కావొస్తోంది. ‘సిగరెట్ తాగి వస్తా’నని చెప్పి భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. గంటలు గడుస్తున్నా ఇంటికి రాలేదు. దాంతో భార్య ఆందోళనకు గురైంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. చివరకు భర్త కోసం వెతుక్కుంటూ బయటకు వచ్చిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
Crime News | అది రాజేంద్రనగర్ ప్రాంతం. సమయం అర్ధరాత్రి కావొస్తోంది. ‘సిగరెట్ తాగి వస్తా’నని చెప్పి భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. గంటలు గడుస్తున్నా ఇంటికి రాలేదు. దాంతో భార్య ఆందోళనకు గురైంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. చివరకు భర్త కోసం వెతుక్కుంటూ బయటకు వచ్చిన ఆమెకు ఊహించని షాక్ తగిలింది. నుదిటిపై తీవ్ర గాయాలతో భర్త విగతజీవిగా కనిపించాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన నాగేంద్ర మాఝీ (23) అత్తాపూర్‌లోని చాప్‌స్టిక్ హోటల్‌లో చైనీస్ కుక్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్ జనా చైతన్య ఫేజ్-1లో భార్య చంద్ర బుధతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 24న రాత్రి 11 గంటలకు సిగరెట్ తాగి వస్తానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. భర్త కోసం వెతుకుతూ బయటకు వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రణవ విల్లాస్ సమీపంలో నాగేంద్ర మాఝీ నుదిటిపై తీవ్ర గాయాలతో మృతిచెంది కనిపించాడు. అతని వద్ద ఉండాల్సిన మొబైల్ ఫోన్ కూడా కనిపించలేదు. దీంతో చంద్ర బుధ ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ ఆర్ వెంకటేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడంతోపాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. నాగేంద్రపై దాడి చేసి హత్య చేసిన అనంతరం అతని మొబైల్ ఫోన్‌ను తీసుకుని యాక్టివాపై నిందితులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మహమ్మద్ సుఫియాన్ సోహిల్ ఫరాష్ (21), 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా, నాగేంద్ర మాఝీ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ టీ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఆర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కేసును ఛేదించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులను అభినందించారు.
తాజావార్తలు
- ●Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు
- ●Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి
- ●Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
- ●Bilibili | యూట్యూబ్‌కు పోటీ యాప్ బిలిబిలి బంపర్ ఆఫర్.. 1,000 వ్యూస్‌కు రూ.66..?
- ●Mir Alam Tank | ఫ్యామిలీ టూరిస్టు హబ్‌గా మీర్ ఆలం చెరువు
- ●Kiren Rijiju | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియలేదు : కిరణ్ రిజిజు

Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు

Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి

Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Bilibili | యూట్యూబ్‌కు పోటీ యాప్ బిలిబిలి బంపర్ ఆఫర్.. 1,000 వ్యూస్‌కు రూ.66..?




