త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | న‌య‌న్ త‌గ్గేదేలే – ఒకే సారి మూడు అవార్డులు…

త‌మిళ‌నాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో న‌య‌న‌తార మూడు అవార్డుల‌ను అందుకుంది. హీరోయిన్‌గానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కూడా అవార్డుల‌ను ద‌క్కించుకుంది. అవార్డుల‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది నయనతార.

N

Entertainment | Published On Feb 17, 2026, 3.31 pm IST

Nayanthara | న‌య‌న్ త‌గ్గేదేలే – ఒకే సారి మూడు అవార్డులు…
Advertisement

Nayanthara |  సౌత్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది న‌య‌న‌తార‌. త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌...ఇలా అన్ని భాష‌ల్లో ఆమె హ‌వా కొన‌సాగుతోంది. ఆఫ‌ర్ల విష‌యంలోనే కాదు రెమ్యూన‌రేష‌న్ల‌లో న‌య‌న‌తార‌నే ద‌క్షిణాదిలో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు ప‌ద‌మూడు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటోంది.

త‌గ్గేదేలే...

సినిమాల ప‌రంగానే కాకుండా ...అవార్డుల విష‌యంలో త‌గ్గేదేలే అని న‌య‌న‌తార నిరూపించింది. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం 2016 - 2022 వ‌ర‌కు ఆరు సంవ‌త్స‌రాల‌ స్టేట్ ఫిల్మ్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో న‌య‌న‌తార మూడు అవార్డుల‌ను గెలుచుకుంది. న‌టిగానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కూడా పుర‌స్కారాన్ని అందుకుంది. న‌య‌న‌తార న‌టించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అర‌మ్‌, నేట్రిక‌న్‌, కూజంగ‌ళ్ సినిమాలు స్టేట్ అవార్డుల్లో స‌త్తా చాటాయి. ఇందులో నేట్రిక‌న్‌, కూజంగ‌ల్ సినిమాల‌కు న‌య‌న‌తార‌నే నిర్మాత‌.

ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్‌

2021 ఏడాదికి ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్‌ విభాగంలో న‌య‌న‌తార నేట్రిక‌న్ అవార్డును సొంతం చేసుకుంది న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ అర‌మ్ మూడు అవార్డుల‌ను గెల‌చుకుంది. ఈ సినిమాలో క‌లెక్ట‌ర్ పాత్ర‌లో అస‌మాన న‌ట‌న‌కు గాను బెస్ట్ హీరోయిన్‌గా న‌య‌న‌తార అవార్డును స్వీక‌రించింది. 2017 ఏడాదికిగాను బెస్ట్ ఫిల్మ్‌గా అర‌మ్ నిలిచింది. బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా సును ల‌క్ష్మికి కూడా పుర‌స్కారాన్ని ద‌క్కించుకుంది.

ప్రొడ్యూస‌ర్‌గా....

హీరోయిన్‌గానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కూడా న‌య‌న‌తార‌ త‌మిళ‌నాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి న‌య‌న‌తార నిర్మించిన కూజంగ‌ళ్ మూవీ 2020 ఏడాదికిగాను బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషించిన చెల్ల‌పాండి బెస్ట్ చైల్డ్ యాక్ట‌ర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవ‌ల స్టేట్ ఫిల్మ్స్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ వేడుక జ‌రిగింది. మూడు స్టేట్ అవార్డుల‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది నయ‌న‌తార‌. న‌టిగా ఈ అవార్డులు త‌న బాధ్య‌త‌ను మ‌రింత పెంచాయ‌ని తెలిపింది. మా సంస్థ నిర్మించిన సినిమాల‌కు పుర‌స్కారావాలు రావ‌డంతో ఆనందం రెట్టింపు అయ్యింద‌ని అన్న‌ది.
ఇటీవ‌లే మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుతో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకుంది న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం తొమ్మిది సినిమాలు చేస్తోంది. టాక్సిక్‌, ముక్కుత్తి అమ్మ‌న్ 2, హాయ్‌తో పాటు న‌య‌న‌తార న‌టించిన ప‌లు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

Advertisement
Advertisement