Nayanthara | అఫీషియల్ – అప్పుడు షారుఖ్ …ఇప్పుడు సల్మాన్ – బాలీవుడ్‌లో నయన్‌కు మరో క్రేజీ ఛాన్స్
షారుఖ్‌ఖాన్ జవాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. తాజాగా హిందీలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. సల్మాన్‌ఖాన్ హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించబోతుంది. ఆమె పేరును మంగళవారం మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
Entertainment | Published On Mar 31, 2026, 3.48 pm IST
Nayanthara | షారుఖ్‌ఖాన్ జవాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయన్ తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను అందుకుంది. నెక్స్ట్ సినిమాను బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్‌తో చేయబోతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో హై ఇంటెన్స్ యాక్షన్ మూవీ రాబోతుంది. సోమవారం ఈ సినిమాను అనౌన్స్‌చేశారు.ఈ పాన్ ఇండియన్ మూవీని దిల్‌రాజు నిర్మించబోతున్నారు.
రూమర్లను నిజం చేస్తూ...
ఏప్రిల్ నుంచి ఈ బాలీవుడ్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. కాగా ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్‌కు జోడీగా నయనతార నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లను నిజం చేస్తూ హీరోయిన్‌గా నయనతార పేరును అఫీషియల్‌గా మంగళవారం ప్రకటించారు. ఈ యాక్షన్ మూవీలో సల్మాన్‌ఖాన్‌కు ధీటుగా నయనతార రోల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని అన్నారు. సల్మాన్, నయన్ జోడీ ఆకట్టుకుంటుందని, వారిద్దరి కెమిస్ట్రీ సరికొత్తగా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు.
సెకండ్ బాలీవుడ్ మూవీ...
షారుఖ్‌ఖాన్ జవాన్ తర్వాత నయనతార చేస్తోన్న సెకండ్ బాలీవుడ్ మూవీ ఇది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 1100 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. జవాన్ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో నయన్‌కు చాలానే అవకాశాలు వచ్చాయి. వాటన్నింటిని కాదని సల్మాన్ ఖాన్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఫస్ట్ షెడ్యూల్‌లో సల్మాన్‌ఖాన్‌తో పాటు నయనతార కూడా పాల్గొననున్నట్లు చెబుతోన్నారు.
మన శంకర్ వరప్రసాద్‌గారు...
ఇటీవలే మన శంకర వరప్రసాద్‌గారుతో తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది నయనతార. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. మన శంకర వరప్రసాద్‌గారు తర్వాత టాలీవుడ్‌లో బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నయన్ హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ టాక్సీక్ జూన్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలోకి రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



