త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanathara | బాల‌కృష్ణ సినిమా నుంచి న‌య‌న‌తార ఔట్? – రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ కార‌ణ‌మా!

బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసింది. ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ అనౌన్స్‌చేశారు. తాజాగా బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా న‌య‌న‌తార‌ను ఈ సినిమా నుంచి ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Jan 4, 2026, 3.29 pm IST

Nayanathara | బాల‌కృష్ణ సినిమా నుంచి న‌య‌న‌తార ఔట్? – రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ కార‌ణ‌మా!
Advertisement

Nayanathara |  అఖండ 2 త‌ర్వాత డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌బోతున్నారు. హిస్టారిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను గ‌త ఏడాది అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. 150 కోట్ల‌తో బాల‌కృష్ణ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ హిస్టారిక‌ల్ మూవీలో న‌య‌న‌తార‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఆమె ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు.

కాస్ట్ ఫెయిల్యూర్‌...

గోపీచంద్ మ‌లినేని మూవీలో బాల‌కృష్ణ యోధుడైన మ‌హారాజుగా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. డ్యూయ‌ల్ షేడ్‌లో ఆయ‌న క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. డిసెంబ‌ర్ నెల‌లోనే ఈ సినిమా లాంఛ్ కావాల్సింది. కానీ అఖండ 2 రిజ‌ల్ట్ ప్ర‌భావం ఈ మూవీపై ప‌డింది. అఖండ 2 కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిల‌వ‌డంతో బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని మూవీ స్టోరీలో మేక‌ర్స్ మార్పులు చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. హిస్టారిక‌ల్ కాన్సెప్ట్‌తో గోపీచంద్ మ‌లినేని సిద్ధం చేసిన క‌థకు ప్రొడ్యూస‌ర్లు అనుకున్న‌దానికంటే రెట్టింపు బ‌డ్జెట్ అవుతోంద‌ట‌. బాల‌కృష్ణ మార్కెట్‌కు మించి ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్లే అఖండ 2 నిర్మాత‌ల‌కు న‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిజ‌ల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని రిస్క్ అనే ఆలోచ‌న‌తో బాలకృష్ణ సినిమా కోసం గోపీచంద్ మ‌లినేని సిద్ధం చేసిన హిస్టారిక‌ల్ స్క్రిప్ట్‌ను ప‌క్క‌న‌పెట్టార‌ట‌. ఈ మూవీ స్థానంలో గోపీచంద్ మ‌లినేనితోనే క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

న‌య‌న‌తార‌ను త‌ప్పించారా?

ఈ సినిమా నుంచి హీరోయిన్ న‌య‌న‌తారను ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌కృష్ణ సినిమా కోసం న‌య‌న‌తార ప‌ది కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ట‌. బ‌డ్జెట్ త‌గ్గించాల‌ని నిర్ణ‌యించుకున్న మేక‌ర్స్ న‌య‌న‌తార స్థానంలో త‌క్కువ రెమ్యూన‌రేష‌న్‌తో మ‌రో నాయిక‌ను తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కానీ మార్పులు చేర్పుల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement