Nayan Sarika | ఆ సినిమాలు ఫ్లాప్ అవడం నా అదృష్టమే..! నయన్ సారిక ఆసక్తికర కామెంట్స్..!
Nayan Sarika, Tollywood Actress, Rakaas Movie Heroine, Nayan Sarika interview, Telugu Cinema Updates, Bench Life web series, Nayan Sarika upcoming projects, Nayan Sarika Tollywood Debut, Telugu News
Entertainment | Published On Apr 4, 2026, 8.30 pm IST
Nayan Sarika | సోలాపూర్ బ్యూటీ నయన్ సారిక టాలీవుడ్‌లో దూసుకెళ్తుంది. వరుస సినిమాలు చెస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం రాకాస మూవీలో నటించింది. ఈ నెల 3న రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన సినిమా ప్రయాణం, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. 12వ తరగతి పూర్తయ్యాక ముంబయిలోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఓ ఫొటోగ్రాఫర్ ఫేస్ చాలా ఫొటోజెనిక్‌గా ఉందని.. ఫొటోలు తీశారని తెలిపింది. ఆ ఫొటోలు చూసిన హైదరాబాద్‌కు చెందిన కాస్టింగ్ డైరెక్టర్ ఆడిషన్ కోసం పిలిచారని.. ఆ తర్వాత ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‌లో నటించినట్లు తెలిపింది. ఆ తర్వాత మిస్టేక్, గం గం గణేశా, కా మూవీలో ఛాన్స్ వచ్చిందని పేర్కొంది.
షూటింగ్ సమయంలో వైరల్ ఫీవర్ వచ్చింది..
ఆయ్ మూవీ సినిమా షూటింగ్ అమలాపురంలో జరుగుతున్న సమయంలో తీవ్రమైన వైరల్ ఫీవర్ వచ్చిందని.. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో పెళ్లికూతురు గెటప్‌లో ఉండగానే స్పృహ తప్పి పడిపోయినట్లుగా పేర్కొంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సి వచ్చిందని తెలిపింది. అదే సమయంలో ‘కా’ డైరెక్టర్ సుజిత్ నుంచి లుక్ టెస్ట్ కోసం ఫోన్ వచ్చిందని.. హాస్పిటల్ బెడ్‌పై ఉన్నానని చెప్పినా కనీసం బాడీ లాంగ్వేజ్ కోసమైనా కలిసి వెళ్లమని చెప్పారని తెలిపింది. నీరసంగా ఉన్న ఆడిషన్ ఇచ్చానని.. ఆ సమయంలో కిరణ్ అబ్బవరం అక్కడ లేరని పేర్కొంది. ఆ తర్వాత సమాచారం ఇస్తామని డైరెక్టర్లు పంచి వేశారని.. రిజెక్ట్ అయ్యానని బాధపడినట్లు పేర్కొంది. రెండురోజుల తర్వాత సత్యభామ పాత్ర కోసం ఫైనల్ చేసినట్లుగా చెప్పారని గుర్తు చేసుకుంది.
గ్లిజరిన్ లేకుండానే..
అయితే, క్లైమాక్స్ చెప్పేవరకు తాను ఒప్పుకోలేదని.. కొత్తగా ఉండడంతో రెమ్యునరేషన్ కోసం ఆలోచించకుండా సైన్ చేసినట్లు చెప్పింది. సత్యభామ పాత్ర తనకు ఒక ఛాలెంజ్ అని తెలిపింది. ఆమె చిన్నప్పటి నుంచి స్కూల్ నాటకాల్లో పాల్గొనేదానన్ని.. ఒక థియేటర్ ఫ్రెండ్ నేర్పిన బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా గ్లిజరిన్ లేకుండానే ఏడవగలనని చెప్పుకొచ్చింది. తాను సాధారణ తెలుగు అమ్మాయినేనని.. తనకు తెలుగు అర్థమవుతుందని తెలిపింది. పుష్ప-2 సెట్స్‌లో అల్లు అర్జున్‌ను కలిసిన సమయంలో తనను చూడగానే.. ‘నువ్వు లోకల్ అమ్మాయివని అనుకున్నాను. సౌత్ ఇండియన్ ఫేస్ నీది’ అన్నారని.. మూవీ చూశాక అభినందించారని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ సైతం కళ్లు చాలా బాగున్నాయని, డెబ్యూ సినిమాలోనే ఇంత ఈజీతో నటించడం గొప్ప విషయమని ప్రశంసించారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం చేతిలో కొన్ని స్కిప్ట్‌లు ఉన్నాయని.. చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. అధికారికంగా సంతకం చేయలేదని.. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే, అది తన కెరీర్‌లోనే ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని చెప్పుకొచ్చింది. తమిళంలోనూ చాలా కథలు వింటున్నానని, ఏవీ ఆమె మనసుకి నచ్చలేదని, మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.
త్వరలోనే బిగ్ అనౌన్స్‌మెంట్..
తనకు ప్రస్తుతం ఉన్న ‘హోమ్లీ గర్ల్’ ఇమేజ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నానని, గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తానని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆమెను కొన్ని పెద్ద సినిమాల నుంచి రిజెక్ట్ చేసిందని.. ఆమెను రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయని.. అసలు షూటింగే పూర్తి కాకుండా అగిపోయాయని తెలిపింది. తాను వనుకున్న సినిమాలు ఫ్లాప్ అవ్వడం చూసి ఏదో రకంగా తనకు మంచే జరిగిందని సంతోషపడ్డానని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం హీరోయిన్లు పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్స్‌ని పెట్టుకుంటున్నారని.. తనకు అలా చేయడం ఇష్టం లేదని.. మనం ప్రేక్షకులకు మరీ ఎక్కువగా కనిపిస్తే వాళ్లకు బోర్ కొడుతుందని.. అందుకే నేను ఎక్కువగా బయట కనిపించని.. మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే వార్తల్లో ఉండాలనుకుంటానని చెప్పుకొచ్చింది. చివరలో త్వరలోనే పెద్ద అనౌన్స్ వచ్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






