త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి న‌వీన్ పొలిశెట్టి వంద కోట్ల మూవీ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏవంటే?

సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన‌ న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు మూవీ వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యాయి. ఫిబ్ర‌వ‌రి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 6, 2026, 2.43 pm IST

OTT | ఓటీటీలోకి న‌వీన్ పొలిశెట్టి వంద కోట్ల మూవీ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏవంటే?
Advertisement

OTT | న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించిన అన‌గ‌న‌గా ఒక రాజు బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టింది. సంక్రాంతికి థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. తాజాగా ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. ఫిబ్ర‌వ‌రి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.అన‌గ‌న‌గా ఒక రాజు మూవీలో న‌వీన్ పొలిశెట్టికి జోడీగా మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతో మారి డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు.

స్టార్ హీరోల‌కు పోటీగా...

చిరంజీవి, ప్ర‌భాస్, ర‌వితేజ సినిమాల‌కు పోటీగా సంక్రాంతి బ‌రిలో అన‌గ‌న‌గా ఒక రాజు నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. స్టార్ హీరోల పోటీని త‌ట్టుకొని ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని అనుకున్నారు. కానీ ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌ల‌క్రిందులు చేస్తూ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. కాన్సెప్ట్ రొటీన్ అయిన న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో ఆడియెన్స్‌ను మెప్పించాడు.
అన‌గ‌న‌గా ఒక రాజు మూవీలో రావుర‌మేష్‌, తార‌క్ పొన్న‌ప్ప‌, చ‌మ్మ‌క్ చంద్ర, బుల్లిరాజు కీల‌క పాత్ర‌ల్లో న టించారు. మిక్కీ జే మేయ‌ర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

అన‌గ‌న‌గా ఒక రాజు క‌థ ఇదే...

రాజు గౌర‌వ‌పురం సంస్థానానికి వార‌సుడు. జ‌మీందారు మ‌న‌వ‌డు అనే పేరు, గౌర‌వం త‌ప్ప ఆస్తిపాస్తులేవి ఉండ‌వు. డ‌బ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కోటీశ్వ‌రుడు కావాల‌ని క‌ల‌లు కంటాడు. ఆస్తి కోస‌మే భూప‌తి రాజు కుమార్తె చారుల‌త‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఫ‌స్ట్ నైట్ రోజే భూప‌తి రాజు ఫ్యామిలీ గురించి రాజుకు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది? అదేమిటి? రాసు ఆస్తి రావ‌డానికి ఊరి ఎన్నిక‌ల‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రాజు ప్రెసిడెంట్ అయ్యాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. తొలుత ఈ మూవీని న‌వీన్ పొలిశెట్టి, శ్రీలీల కాంబినేష‌న్‌లో అనౌన్స్‌చేశారు. అనివార్య కార‌ణాల శ్రీలీల త‌ప్పుకోవ‌డం మీనాక్షిని హీరోయిన్‌గా తీసుకున్నారు.

Advertisement
Advertisement