Meenakshi Chaudhary | నేను 18 గంటలు పని చేశా.. మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Meenakshi Chaudhary | సినీ ఇండస్ట్రీలోనూ ఎనిమిది గంటల వర్క్‌షిఫ్ట్‌ను అమలు చేయాలని బాలీవుడ్‌లో గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తున్నది. ఈ నేనథ్యంలో టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Pradeep Manthri
Photo gallery | Published On May 20, 2026, 8.50 pm IST

Meenakshi Chaudhary | సినీ ఇండస్ట్రీలోనూ ఎనిమిది గంటల వర్క్‌షిఫ్ట్‌ను అమలు చేయాలని బాలీవుడ్‌లో గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తున్నది. ఈ నేనథ్యంలో టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

మరింత క్రమశిక్షణ, మెరుగైన ప్రణాళిక ఉంటే సినిమా రంగంలో అందరికీ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా నిర్మాణమనేది ఓ సృజనాత్మక ప్రక్రియని, దాంతో కొన్నిసార్లు సమయపాలన పాటించడం కొన్నిసార్లు కష్టమవుతుందని తెలిపింది.

ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ క్రమశిక్షణ అవసరం ఉంటుందని, క్రియేటివ్ ఫీల్డ్ కావడంతో ఎప్పుడూ ఖచ్చితంగా ఫాలో కావడం కష్టమేనని తెలిపింది. ఒకే సమయంలో అనేకమంది పని చేస్తుంటారని, లోకేషన్స్‌కు పరిమితులు ఉంటాయని పేర్కొంది.

తాను 18 గంటల షిప్టులో పనిచేశానని.. ఉదయం ఓ సినిమా షూట్, రాత్రి మరో సినిమా షూట్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయని చెప్పుకొచ్చింది.

ప్రీ-ప్రొడక్షన్ బాగా ఉంటే, షూటింగ్ షెడ్యూల్స్ సజావుగా సాగుతాయని, ఖర్చులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.

అందరూ ముందస్తుగానే ప్రిపేర్ అయితే నిర్మాతలకు ఖర్చులు తగ్గుతాయని, ఆర్టిస్టులు సైతం ఎనర్జీ మిగులుతుందని, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఈ దిశలో ఆలోచిస్తోందని తెలిపింది. ఇండస్ట్రీలో పారితోషకంలో తేడాలపై సైతం మీనాక్షి స్పందించింది.

ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, కేవలం ఒకే రోజులు మార్పు రాదని స్పష్టం చేసింది. అవగాహన పెరుగుతోందని, ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతున్నాయని.. మార్పునకు సమయం పడుతుందని తెలిపింది.

తాను కోరిన రెమ్యునరేషన్ రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌కి అభినందనలు తెలిపినట్లు చెప్పింది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే శుభాకాంక్షలు తెలిపానని.. వెంటనే ఆయన స్పందించడం ఆనందం కలిగిందని పేర్కొంది.

కలిసి పనిచేసిన వ్యక్తి ఇంతటి స్థాయికి చేరుకోవడం నిజంగా గర్వకారణమని.. దేశం మొత్తం ఆయన గురించి మాట్లాడుతోందని, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని మీనాక్షి తెలిపింది.

ప్రస్తుతం మీనాక్షి తెలుగులో నాగచైతన్యతో కలిసి వృషకర్మ మూవీలో నటిస్తోంది. కార్తితో మరో సినిమాలో నటించనుంది.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


