త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పుష్ప నిర్మాత పేరుతో ఫేక్ అకౌంట్ – అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్‌

N

Entertainment | Published On Dec 7, 2025, 6.18 pm IST

పుష్ప నిర్మాత పేరుతో ఫేక్ అకౌంట్ – అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్వీట్‌

మైత్రీ మూవీ మేకర్స్

Advertisement

సోషల్ మీడియా వ‌ల్ల ఎంత మంచో అంత చెడు కూడా ఉంది. సెలిబ్రిటీల పేరుతో న‌కిలీ ఖాతాలు తెరుస్తూ సామాన్యుల‌ను మోసం చేస్తున్న సంఘ‌ట‌న‌లు త‌ర‌చుగా జ‌రుగుతూనే ఉన్నాయి. సినిమా ఇండ‌స్ట్రీలోనూ ఇలాంటి చీటింగ్‌లు ఇటీవ‌ల ఎక్కువైపోయాయి. సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తామంటూ న‌మ్మించి టోక‌రా వేస్తున్నారు. పుష్ప సినిమా నిర్మాత న‌వీన్ యేర్నేని పేరుతో సోష‌ల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసిన ఓ వ్య‌క్తి తాము నిర్మిస్తున్న‌ సినిమాల్లో ఆఫ‌ర్లు ఇస్తామంటూ మోసాలు చేస్తున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది.
ఫేక్ క్యాస్టింగ్ కాల్స్‌ను న‌మ్మ‌ద్దంటూ మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. న‌వీన్ యెర్నేని పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ‌రో అకౌంట్ ఓపెన్ చేసిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, ఈ ఫేక్ అకౌంట్ ప‌ట్ల అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలిపెంది.
కాస్టింగ్ కాల్స్‌కు సంబంధించిన ఎలాంటి ప్ర‌క‌ట‌న అయినా త‌మ అఫీషియ‌ట్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారానే వెల్ల‌డిస్తామ‌ని, త‌మ‌కు ఎవ‌రూ ఏజెంట్స్ లేర‌ని, క్యాస్టింగ్ ఏజెన్సీ ల‌ను నియ‌మించుకోలేద‌ని తెలిపారు. నిర్మాణ సంస్థ పేరును ఉప‌యోగించుకుంటూ ఎవ‌రైనా మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిస్తే త‌మ‌ దృష్టికి తీసుకురావాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ కోరింది. ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ కొన‌సాగుతోంది. శ్రీమంతుడు సినిమాతో ఈ నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పుష్ప‌, పుష్ప 2, స‌ర్కారు వారి పాట‌, ఉప్పెన‌, వాల్తేర్ వీర‌య్య‌తో పాటు ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను నిర్మించింది. తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ సినిమాల నిర్మాణంపై కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ దృష్టిసారిస్తోంది.
ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, రామ్‌చ‌ర‌ణ్ పెద్ది, ఎన్టీఆర్ డ్రాగ‌న్‌తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ప‌లు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement