Thaman | యాక్టింగ్ టార్చర్ – హీరో ఎంట్రీపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరో ఎంట్రీపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్టింగ్ అంటే టార్చర్ అని అన్నారు. దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీ కథ తాను విన్నానని, తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారు. తమన్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jun 8, 2026, 2.28 pm IST
Thaman | మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారడం దక్షిణాదిలో కొత్తేమీ కాదు. విజయ్ ఆంటోనీ, జీవీ ప్రకాష్ కుమార్‌తో పాటు పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు కథానాయకులుగా రాణిస్తున్నారు. ఎల్లమ్మ మూవీతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తమిళ మూవీలో...
మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఇదయం మురళి అనే తమిళ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు. ఓజీ టూర్ ఇండియా పేరుతో త్వరలో మ్యూజిక్ కాన్సెర్ట్‌ను తమన్ నిర్వహించబోతున్నాడు. ఈ కాన్సెర్ట్ ప్రోమో రిలీజ్ ప్రెస్‌మీట్‌లో యాక్టర్‌గా రీఎంట్రీపై తమన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "దర్శకుడు బలవంతం చేయడంతో ఇదయం మురళిలో నటించడానికి ఒప్పుకున్నా. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. ఇటీవలే డబ్బింగ్ కూడా చెప్పా. రోజూ జీవితంలో యాక్టింగ్ చేస్తూనే ఉన్నా. మళ్లీ కెమెరా ముందు నటించడం అంటే బోర్" అని తమన్ అన్నారు.
ప్రశాంతంగా ఉన్నా...
దేవిశ్రీప్రసాద్ మాదిరిగానే తెలుగులో మీరు హీరోగా సినిమా చేసే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు తమన్ రియాక్ట్ అయ్యారు. "హీరోగానే బాయ్స్ సినిమాతో నా కెరీర్ మొదలైంది. యాక్టింగ్ నుంచే మ్యూజిక్ డైరెక్టర్‌గా మారా. యాక్టింగ్ నా దృష్టిలో చాలా టార్చర్. చక్కగా ఏసీ రూమ్‌లో కూర్చొని ట్యూన్స్ కంపోజ్ చేసుకోవడమే నాకు ఇష్టం. ప్రశాంతంగా ఉన్నా. అవకాశాలు చాలానే వస్తున్నాయి. కానీ నటించడం ఇష్టం లేకే వాటిని వదులుకుంటున్నా" అని తమన్ చెప్పాడు.
ఎల్లమ్మ కథ విన్నా...
దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీ కథ తనకు తెలుసునని తమన్ అన్నారు. "ఎల్లమ్మ కథ నేను విన్నా. తప్పకుండా బ్లాక్‌బస్టర్ సినిమా అవుతుంది. దేవిశ్రీప్రసాద్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. అవసరమైతే నేను ఆ సినిమాకు మ్యూజిక్ అందిచండానికి సిద్ధమని నిర్మాత దిల్‌రాజుతో చెప్పా. నేనే....నాదే అనే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి పనిచేయడమే నాకు ఇష్టం" అని తమన్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Y Satish Reddy | తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి : వై సతీష్ రెడ్డి
- ●Infinix Smart 20 | పవర్ఫుల్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?
- ●Indian Railway | రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు.. ఆగస్టు నుంచే అమలు..!
- ●Opposition leaders | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. SIRపై సీజేఐకి లేఖ.. ఇండీ కూటమి కీలక నిర్ణయాలు
- ●BRS Party | 1950 రాష్ట్రపతి ఉత్తర్వును సవరించాలి.. బాలకృష్ణన్ కమిషన్‌ను కలవనున్న బీఆర్ఎస్ బృందం
- ●Stock Markets | యుద్ధం ఆందోళనలతో.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Y Satish Reddy | తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి : వై సతీష్ రెడ్డి

Infinix Smart 20 | పవర్ఫుల్ డిస్ప్లే, భారీ బ్యాటరీతో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 ఫోన్.. ధర ఎంతంటే..?

Indian Railway | రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు.. ఆగస్టు నుంచే అమలు..!

Opposition leaders | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. SIRపై సీజేఐకి లేఖ.. ఇండీ కూటమి కీలక నిర్ణయాలు




