త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆర్జీవీ మొహంపై క‌త్తిగాట్లు..

N

Entertainment | Published On Dec 5, 2025, 9.16 am IST

ఆర్జీవీ మొహంపై క‌త్తిగాట్లు..

రామ్ గోపాల్ వర్మ

Advertisement

కాంట్ర‌వ‌ర్సీ అంటే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఫ‌స్ట్ గుర్తొచ్చే పేరు ఆర్‌జీవీదే. గ‌త కొన్నేళ్లుగా సినిమాల కంటే వివాదాల‌తోనే డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ పేరు ఫేమ‌స్ అయ్యింది. సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ చేసిన ట్వీట్స్‌, కామెంట్స్ చాలా సార్లు ర‌చ్చ ర‌చ్చ‌గా మారాయి. ఈ కాంట్ర‌వ‌ర్సీల కార‌ణంగా వ‌ర్మ‌తో సినిమా అంటేనే స్టార్స్ వెన‌క‌డుగు వేస్తున్నారు. డైరెక్ట‌ర్‌గా కూడా ఆర్‌జీవీ హిట్టు అందుకొని చాలా కాల‌మైంది.
తాజాగా ఆర్‌జీవీ హీరోగా ఓ తెలుగు మూవీ చేస్తున్నాడు. అత‌డి డెబ్యూ మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల‌య్యాయి. ఈ సినిమాకు షో మ్యాన్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా పోస్ట‌ర్స్‌ను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. ఇందులో గుబురు గ‌డ్డం, పొడ‌వైన హెయిర్‌ స్టైల్‌తో ర‌గ్గ్‌డ్ లుక్‌లో రామ్‌గోపాల్ వ‌ర్మ క‌నిపిస్తున్నారు. మెడ‌లో చైన్‌, ముఖంపై క‌త్తి గాట్ల‌తో ఉన్న ఈ పోస్ట‌ర్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.
షో మ్యాన్ మూవీకి నూత‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డైరెక్ట‌ర్‌గా ఈ మూవీతోనే అత‌డు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. సీనియ‌ర్ హీరో సుమ‌న్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ను ఇటీవ‌ల సైలెంట్‌గా మొద‌లుపెట్టార‌ట‌. సంక్రాంతికి షో మ్యాన్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
డైరెక్ట‌ర్‌గా ఆర్‌జీవీకి గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాలే ఎక్కువ‌గా పేరుతెచ్చిపెట్టాయి. హీరోగా కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో ఫ‌స్ట్ మూవీ చేయ‌బోతున్నాడు. ఇందులో ఫేమ‌స్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఆర్‌జీవీ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
హీరోగా ఆర్‌జీవీ సినిమా ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.
ఆర్‌జీవీ డెబ్యూ మూవీ శివ ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రీ రిలీజైంది. నాగార్జున హీరోగా న‌టించిన ఈ మూవీ రీ రిలీజ్‌లోనూ అద‌ర‌గొట్టింది. నాలుగు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సాధించింది.
ప్ర‌స్తుతం రామ్‌గోపాల్ వ‌ర్మ పోలీస్ స్టేష‌న్ మే భూత్ అనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ బాలీవుడ్ మూవీలో మ‌నోజ్ బాజ్‌పాయ్‌, ర‌మ్య‌కృష్ణ‌,జెనీలియా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement