Tollywood | అప్పుడు తల్లి…ఇప్పుడు కూతురు – ఎం.ఎస్ రాజు మూవీతో టాలీవుడ్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ
ఎంఎస్ రాజు నిర్మించిన దేవి మూవీతో సీనియర్ హీరోయిన్ మంజుల కూతురు వనిత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న అగధతో వనిత కూతురు జోవికా తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతుంది.
Entertainment | Published On Apr 30, 2026, 3.18 pm IST
Tollywood | కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన దేవి మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దేవి మూవీతో సీనియర్ హీరోయిన్ మంజుల కూతురు వనిత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దేవి సినిమాను ఎం.ఎస్ రాజు నిర్మించారు. తాజాగా ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న అగధ సినిమాతో మంజుల మనవరాలు, వనిత కూతురు జోవికా తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతుంది. ఎం.ఎస్ రాజు సినిమాతోనే అప్పుడు తల్లి, ఇప్పుడు కూతురు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.
హరిణిగా...
అగధ మూవీ నుంచి జోవికా విజయ్ కుమార్ క్యారెక్టర్ పోస్టర్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఇందులో హరిణి అనే పాత్రలో జోవికా కనిపించబోతున్నది. జోరున కురుస్తోన్న వర్షంలో కత్తి పట్టుకొని పవర్‌ఫుల్ లుక్‌లో జోవికా కనిపిస్తోంది.
షూటింగ్ కంప్లీట్...
ఎంఎస్ రాజు కథను అందిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
టాప్ హీరోయిన్‌గా...
కాగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందింది మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, ఏయన్నార్ తో దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రయ్య, కృష్ణ తో మాయదారి మల్లిగాడు, రక్తసంబంధాలు, శోభన్‌బాబు తో మంచి మనుషులు, పిచ్చిమారాజు వంటి ఎన్నో సూపర్ హిట్స్ లో నటించారు. వనిత తెలుగులో దేవి, మళ్లీపెళ్లిల్లో సినిమాలు చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bigg Boss Ayesha | హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్
మే 18, 2026

Nargis Fakhri | ఐటెం సాంగ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ
మే 16, 2026

Ulka Gupta | తెలుగు సినిమాలో కేరళ స్టోరీ 2 హీరోయిన్ – పదకొండేళ్ల తర్వాత రీఎంట్రీ
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



