త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | ధ‌నుష్ నాకు అన్న‌య్య – మృణాల్ అంత మాట అనేసిందా?

కోలీవుడ్ హీరో ధ‌నుష్‌తో పెళ్లి వార్త‌ల‌పై మృణాల్ ఠాకూర్ రియాక్ట్ అయ్యింది. ధ‌నుష్ త‌న‌కు అన్న‌య్య‌లాంటోడు అని అన్న‌ది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే షేర్లు, లైక్‌ల కోసం ఇలాంటి నిరాధార‌మైన పుకార్ల‌ను వ్యాప్తి చేయ‌ద్ద‌ని మృణాల్ పెట్టిన‌ట్లుగా చెబుతోన్న ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Feb 2, 2026, 2.56 pm IST

Mrunal Thakur | ధ‌నుష్ నాకు అన్న‌య్య – మృణాల్ అంత మాట అనేసిందా?
Advertisement

Mrunal Thakur |  కోలీవుడ్ హీరో ధ‌నుష్‌ను మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లుగా గ‌త కొద్ది రోజులుగా జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. చెన్నైలో నిరాడంబ‌రంగా వీరి పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ రూమ‌ర్ల‌పై ధ‌నుష్‌తో పాటు మృణాల్ సైలెంట్‌గా ఉండ‌టంతో పెళ్లి జ‌రుగ‌నుంది నిజ‌మేన‌ని అభిమానులు అనుకున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ పుకార్ల‌పై మృణాల్ ఠాకూర్‌ మౌనం వీడింది. ధ‌నుష్ నాకు అన్న‌య్య‌లాంటోడు అంటూ బాంబ్ పేల్చింది. పెళ్లి రూమ‌ర్స్‌పై మృణాల్ రియాక్ట్ అయిన‌ట్లుగా చెబుతోన్న ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ధ‌నుష్‌తో త‌న‌కు వృత్తి ప‌ర‌మైన రిలేష‌న్ మాత్ర‌మే ఉంద‌ని, అంత‌కుమించి మా మ‌ధ్య‌ ఏం లేద‌ని అన్న‌ది.

క‌ట్టుక‌థ‌లు అల్లుతున్నారు...

"నిరాధార‌మైన ఇలాంటి గాసిప్స్ తో కాకుండా....నా న‌ట‌న‌తో, సాధించిన విజ‌యాల‌తో ప్రేక్ష‌కుల‌కు చేరువ కావాల‌ని నిరంత‌రం త‌పిస్తుంటాను. అందుకే ఇలాంటి పుకార్ల‌ను నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను. నా ప్ర‌మేయం లేకుండా చాలా రూమ‌ర్లు బ‌య‌ట ప్ర‌చారంలో ఉన్నాయి. నాకు సంబంధంలేని విష‌యాల‌తో నా పేరు ముడిపెడుతూ క‌ట్టుక‌థ‌లు అల్ల‌డం చూస్తుంటే బాధగా ఉంది. గత కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో నా పెళ్లి గురించి చాలా వార్త‌లు వినిపిస్తున్నాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు. ధనుష్ అంటే నాకు చాలా గౌర‌వ‌ముంది. నాకు ఆయ‌న ఒక సోదరుడితో సమానం. ప్రొఫెష‌న‌ల్‌గా త‌ప్పితే మా మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి బంధం లేదు" అని మృణాల్ ఠాకూర్ అన్న‌ది.

నిద్ర‌లేని రాత్రులు...

"నా వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఏదో పెద్ద‌ ర‌హ‌స్యాన్ని దాస్తున్నాన‌ని, అందుకే మౌనంగా ఉంటున్నానంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. నా లైఫ్ గురించి ఎవ‌రికి క్లారిటీ ఇవ్వాల్సిన ప‌నిలేదు.నేను సాధించిన విజ‌యాలు, పేరు ప్ర‌ఖ్యాతులు, గుర్తింపు ఒక్క రోజులు వ‌చ్చిన‌వి కాదు. వాటి వెనుక ఎన్నో ఆడిషన్లు, మరెన్నో తిరస్కరణలు, నిద్రలేని రాత్రులు గ‌డిపాను. నా కష్టాన్ని అర్థంలేని ఒక్క‌ పుకారుతో తక్కువ చేసి చూడటం స‌రికాదు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే క్లిక్‌లు, లైక్‌లు మరియు షేర్స్‌ కోసం ఇత‌రుల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దు" అంటూ మృణాల్ ఠాకూర్ ఈ పోస్ట్‌లో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. మృణాల్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది మృణాల్ ఠాకూర్‌. తెలుగులో అడివిశేష్ డెకాయిట్‌తో పాటు అల్లు అర్జున్‌, అట్లీ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Advertisement
Advertisement