త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ సినిమాకు షాకింగ్ క‌లెక్ష‌న్స్ – తొలిరోజే థియేట‌ర్లు ఖాళీ

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ బాలీవుడ్ దో దీవానే షెహ‌ర్ మే తొలిరోజు బాక్సాఫీస్ తేలిపోయింది. దాదాపు 40 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా శుక్ర‌వారం రోజు కేవ‌లం కోటి ఇర‌వై ఐదు ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది.

N

Entertainment | Published On Feb 21, 2026, 7.54 pm IST

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ సినిమాకు షాకింగ్ క‌లెక్ష‌న్స్ – తొలిరోజే థియేట‌ర్లు ఖాళీ
Advertisement

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన దో దీవానే షెహ‌ర్ మే తొలిరోజే బాక్సాఫీస్ వ‌ద్ద డిస‌పాయింట్ చేసింది. మొద‌టే రోజే సినిమా ఆడుతున్న థియేట‌ర్లు చాలా వ‌ర‌కు ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో సిద్ధాంత్ చ‌తుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ర‌వి ఉద్య‌వార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్రొడ్యూస‌ర్‌...

బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మించిన మూవీ కావ‌డంతో దో దీవానే షెహ‌ర్ మే పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రీచ్ కావ‌డంలో మాత్రం డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యారు.
దాదాపు న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన దో దీవానే షెహ‌ర్ మే మే తొలిరోజు కేవ‌లం కోటి ఇర‌వై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకుంది. శుక్ర‌వారం రోజు కేవ‌లం తొమ్మిది శాతం మాత్ర‌మే ఆక్యుపెన్సీ న‌మోదు అయ్యింది. ముంబాయితో పాటు చాలా సిటీస్‌లో దో దీవానే షెహ‌ర్ మే థియేట‌ర్లు ఖాళీగా ద‌ర్శ‌న‌మివ్వ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు మేక‌ర్స్‌ను విస్మ‌యానికి గురిచేసింది.

జెన్‌జీ ల‌వ్‌స్టోరీ...

రోషిని, శ‌శాంక్ అనే జంట ప్రేమ‌క‌థ‌తో జెన్‌జీ ల‌వ్‌స్టోరీగా డైరెక్ట‌ర్ ర‌వి ఉద్య‌వార్ ఈసినిమాను తెర‌కెక్కించారు. కెరీర్ ప‌రంగా త‌మ‌కున్న స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించే క్ర‌మంలో ఆ జంట ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌, వారి ప్రేమ‌క‌థ‌లో ఎదురైన స‌వాళ్ల‌తో డైరెక్ట‌ర్ ఈ సినిమా రూపొందించారు. స్టోరీతో పాటు మృణాల్ - సిద్ధాంత్ రొమాంటిక్ ట్రాక్‌తో ఆడియెన్స్ ఏ మాత్రం క‌నెక్ట్ కాలేక‌పోయారు.
స్లో ఫేజ్ స్టోరీ కార‌ణంగా బోరింగ్ మూవీ అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ సినిమాను ట్రిమ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచిదంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాప్సీ సినిమా కూడా...

మృణాల్ ఠాకూర్ క్రేజ్ కూడా ఆడియెన్స్‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయింది. దో దీవానే షెహ‌ర్ మే తో పాటు శుక్ర‌వారం రిలీజైన మ‌రో బాలీవుడ్ మూవీ అస్సీది అదే ప‌రిస్థితి. తాప్సీ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ కూడా ఫ‌స్ట్ డే కేవ‌లం కోటి రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ నిరాశ‌ప‌రిచింది. కాగా ప్రస్తుతం తెలుగులో అడివిశేష్ డెకాయిట్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది మృణాల్ ఠాకూర్‌. అల్లు అర్జున్‌, అట్లీ మూవీలో క‌థానాయిక‌గా ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement
Advertisement