Prabhas | ముంబైలో షూటింగ్ అయితే.. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్న ప్రభాస్.. ఫ్లైట్‌లో డెలివరీ
Prabhas | పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ (Prabhas)కు ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు.. చెన్నై ఫుడ్ (Chennai food) తినాలనిపించిందట. వెంటనే ఆయన అక్కడి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. ఫ్లైట్‌లో ఆర్డర్ వచ్చింది.
Entertainment | Published On Feb 21, 2026, 11.22 am IST
Prabhas | పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ (Prabhas)కు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ సమయంలో ఇంటి నుంచి ప్రభాస్‌కు పెద్ద క్యారేజ్ వస్తుంది. అది కేవలం ఈ స్టార్ కోసం మాత్రమే కాదండోయ్.. సెట్‌లో పనిచేసే వాళ్లందరికీ ఇంటి భోజనాన్నే తెప్పిస్తారు ప్రభాస్. స్థానిక వంటకాలతోపాటూ అన్ని రకాల వెరైటీస్‌ను ప్రిపేర్ చేయించి.. సహ నటులకు పంపిస్తుంటారు. షూటింగ్ లొకేషన్స్‌కే కాదు.. నటుల ఇళ్లకు కూడా ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజీలు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తాను వేరే స్టేట్స్ నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటానంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రభాస్ నిర్మాణ సంస్థ UV Creations నిర్మించిన తాజా చిత్రానికి సంబంధించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్‌తో ప్రభాస్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిపురుష్ (Adipurush) షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకు చెన్నై ఫుడ్ (Chennai food) తినాలనిపించిందని చెప్పారు. వెంటనే చెన్నైనుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు వివరించారు. ఫ్లైట్‌లో ఆర్డర్ వచ్చిందని.. అది చూసి సెట్‌లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఫుడ్ తెచ్చిన వ్యక్తితోపాటూ, సెట్‌లోని వారంతా మీరు మామూలోడు కాదండి బాబూ అని అన్నారని ప్రభాస్ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026

Amitabh Bachchan | నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
మే 20, 2026

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



