Funky Day 1 Collections | విశ్వక్‌సేన్ ఫంకీ ఫస్ట్ డే కలెక్షన్స్ – లైలా కంటే ఎక్కువే కానీ…
విశ్వక్‌సేన్ ఫంకీ మూవీ తొలిరోజు నెగెటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. వరల్డ్ వైడ్‌గా రెండు కోట్లు పది లక్షలకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Feb 14, 2026, 7.57 pm IST
Funky Day 1 Collections | ఫంకీ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. విశ్వక్‌సేన్ రీసెంట్ రిలీజ్‌లలో తొలి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో...
సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ఫంకీ మూవీని తెరకెక్కించారు దర్శకుడు అనుదీప్. ప్రొడ్యూసర్ కూతురితో డైరెక్టర్ ఎలా ప్రేమలో పడ్డాడు? వారి లవ్ జర్నీకి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో చూపించారు. లాజిక్స్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్‌ను నవ్వించడానికే దర్శకుడు ప్రయత్నించారు. అయితే కామెడీ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడం, కథలో బలం లేకపోవడంతో తొలిరోజు ఫంకీ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
నాలుగు కోట్ల కలెక్షన్స్...
ఓవరాల్‌గా ఫస్ట్ డే ఫంకీ వరల్డ్ వైడ్‌గా నాలుగు కోట్లకుపైగా గ్రాస్...రెండు కోట్ల పది లక్షల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కోటి పది హేను లక్షలు, ఓవర్‌సీస్‌లో 80 లక్షలు, కర్ణాటక, రాయచూర్‌లలో పదిహేను లక్షల వరకు షేర్ వసూళ్లను దక్కించుకుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హయ్యెస్ట్...
విశ్వక్‌సేన్ గత సినిమాలు తొలిరోజు లైలా 80 లక్షలు, మెకానిక్ రాఖీ కోటి వరకు వసూళ్లను దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాల కంటే ఫంకీ ఎక్కువే కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మూడున్నర కోట్లతో విశ్వక్‌సేన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 14 కోట్ల వరకు జరిగింది. పదిహేను కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది. తొలి రోజు కలెక్షన్స్ తక్కువే వచ్చినా పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం ఫంకీకి కలిసిరావచ్చుననే టాక్ వినిపిస్తోంది. రెండో రోజు ఈ మూవీ కోటికిపైనే కలెక్షన్స్ దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఫంకీ మూవీలో సంపత్, నరేష్, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






